వాట్సాప్‌లో బయాలజీ టీచర్‌ రొమాన్స్‌ | Student And Teacher Love In Annamayya District | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌లో బయాలజీ టీచర్‌ రొమాన్స్‌

Oct 3 2026 1:48 PM | Updated on Oct 3 2026 2:12 PM

Student And Teacher Love In Annamayya District

అన్నమయ్య జిల్లా: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు తమ బిడ్డకు ప్రేమ పాఠాలు నేర్పడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా వెలిగళ్లు జిల్లా పరిషత్‌ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న బయాలజీ ఉపాధ్యాయుడు తన కుమార్తెతో సన్నిహితంగా ఉంటూ వాట్సాప్‌లో చాటింగ్‌ చేయడంతో పాటు ఫోన్‌లో ప్రేమ పాఠాలు నేర్పుతున్నాడంటూ ఓ విద్యార్థిని తల్లి విద్యాశాఖ అధికారులను ఆశ్రయించారు. 

తొలుత ఈ విషయాన్ని పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఉపాధ్యాయుడిని మందలించినప్పటికీ మార్పు కనిపించకపోవడంతో ఎంఈఓ–1 పిల్లి నాగరాజు, ఎంఈవో–2 శ్రీనువాసులుకు గురువారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు.  ఈ విషయంపై గాలివీడు ఎంఈఓ పిల్లి నాగరాజు మాట్లాడుతూ.. శుక్రవారం పాఠశాలకు సెలవు కావడంతో శనివారం పాఠశాలకు వెళ్లి సంబంధిత అంశంపై విచారణ చేపడతామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement