హోజాయ్: అస్సాంలోని హోజాయ్ జిల్లాలో రైల్వే ట్రాక్‌ను దాటుతున్న అడవి ఏనుగుల గుంపును గమనించిన లోకో పైలట్, అప్రమత్తతతో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను సకాలంలో నిలిపివేసి పెను ప్రమాదాన్ని నివారించారు. బుధవారం ఉదయం లంకా రేంజ్ పరిధిలోని హవైపూర్ ప్రాంతంలో (కిలోమీటర్ 167/8 వద్ద) ఈ ఘటన చోటుచేసుకుంది.
An unexpected halt on the tracks, but only for our adorable giants to pass by.
This morning, the Down Rajdhani Express was stopped at Km 167/8 as an elephant herd crossed the tracks at Hawaipur under Lanka Range, Nagaon South Division, Hojai.
Alert action by our @assamforest… pic.twitter.com/qhPseOLNCv— Jayanta Mallabaruah (@jayanta_malla) August 19, 2026
డౌన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆ మార్గంలో వస్తున్న సమయంలోనే ఏనుగుల గుంపు ట్రాక్ వైపు రావడం విధుల్లో ఉన్న అటవీ శాఖ సిబ్బంది కంటపడింది. వారు వెంటనే స్పందించి సమాచారాన్ని లోకో పైలట్‌తో పాటు లుమ్డింగ్ రైల్వే కంట్రోల్ రూమ్‌కు చేరవేశారు. సమన్వయంతో రైలును వెంటనే నిలిపివేయడంతో ఏనుగులన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా సురక్షితంగా పట్టాలు దాటాయి. అనంతరం రైలు తన ప్రయాణాన్ని యథావిధిగా కొనసాగించింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అస్సాం అటవీ శాఖ మంత్రి జయంత మల్ల బారువా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ అధికారులను ప్రశంసించారు. అటవీ సిబ్బంది, రైల్వే యంత్రాంగం సమన్వయంతో వ్యవహరించి వన్యప్రాణులను కాపాడారని ఆయన కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా వన్యప్రాణుల కారిడార్ల మీదుగా వెళ్లే రైల్వే మార్గాల్లో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని, ఈ చర్యలు మానవ-వన్యప్రాణి సంఘర్షణలను, రైలు ప్రమాదాలను అరికట్టడంలో కీలకంగా మారాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: గ్రీకుల గర్భనిరోధక మొక్క.. రెండువేల ఏళ్ల తర్వాత ప్రత్యక్షం


