కర్ణాటక రాష్ట్రం, చిక్కబళ్లాపురం జిల్లా, చింతామణి సమీపంలో ఉన్న [Kailasagiri Hills] ప్రసిద్ధ మానవ నిర్మిత గుహాలయం (Cave Temple). ప్రశాంతమైన వాతావరణం, సుందరమైన ప్రకృతి నడుమ రాతి కొండపై ఈ ఆలయం ఉంది. (Kailasagiri Hills Chintamani )
కొండను తొలిచి కట్టిన పెద్ద గుహాలయం ఇది.
ప్రధాన దైవం చతుర్ముఖ లింగేశ్వర స్వామి (శివుడు).ఇంకా శ్రీ జగదాంబ (పార్వతి), శ్రీ వల్లభ గణపతి విగ్రహాలు ఉన్నాయి.
కొండ పైకి వెళ్లడానికి సుమారు 200 మెట్లు ఎక్కాలి.చుట్టూ ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తాయి.
కొండను తొలిచి మానవ ప్రయత్నంతో నిర్మించిన అతిపెద్ద గుహాలయాల్లో ఇది ఒకటి.
పాండవులు తమ అజ్ఞాతవాసంలో ఇక్కడకు వచ్చారని, భీముడు బకాసురుడిని వధించాడని స్థానికుల నమ్మకం.
బెంగళూరు నుండి ఇది దాదాపు 80-90 కిలోమీటర్ల దూరంలో ఉంది.


