ఇన్‌స్టామార్ట్‌లో బొద్దింక : ఎఫ్‌డీఏ తుకారాంకు హీరోయిన్‌ విజ్ఞప్తి | Shweta Tiwari Claims Cockroach Found In Instamart Cold Drinks Order Tags Tukaram Mundhe | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టామార్ట్‌లో బొద్దింక : ఎఫ్‌డీఏ తుకారాంకు హీరోయిన్‌ విజ్ఞప్తి

Aug 20 2026 12:02 PM | Updated on Aug 20 2026 12:14 PM

Shweta Tiwari Claims Cockroach Found In Instamart Cold Drinks Order Tags Tukaram Mundhe

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్ తుకారాం ముండే (FDA Commissioner Tukaram) రాష్ట్రంలో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలు మరియు మందుల నియంత్రణపై భారీ చర్యలు చేపడుతున్నారు.  రెస్టారెంట్లు హోటళ్లు, ప్రముఖ ఫార్మా కంపెనీలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, పెద్ద ఎత్తున లైసెన్సులు సస్పెండ్ చేయడం , అమ్మకాలను నిలిపివేయడం, నోటీసులు జారీ లాంటి చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు తుకారం ముండే చర్యలపై ప్రశంసలు కురిపించారు.

మరోవైపు ముండే వ్యవహారశైలిపై బాంబై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు నోటీసులివ్వకుండా  తనిఖీల పేరుతో ఎఫ్‌డీఏ చేపడుతున్న దూకుడు చర్యలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసిన తరుణంగా తాజాగా  తుకారాం ముండేకి ట్యాగా చేస్తూ నటి శ్వేతా తివారీ Shweta Tiwari) చేసిన విజ్ఞప్తి ఆసక్తికరంగా మారింది. 

ఇదీ చదవండి: రూ. 5వేలతో ముంబైకి, పూటగడవని స్థితి..ఇపుడు సూపర్‌ స్టార్‌డమ్‌

అసలు ఏమైంది? 
శ్వేతా తివారీ  ఒక క్విక్-కామర్స్ యాప్ ద్వారా ఇన్‌స్టామార్ట్‌ ద్వారా  ఆర్డర్ చేసిన సరుకులతో పాటు ఇంట్లోకి బొద్దింక వచ్చిందని ఆరోపించిది. ఈ యాప్ ద్వారా కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేసిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు శ్వేతా తివారీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. దీనికి మహారాష్ట్ర ఎఫ్‌డీఏ మిషనర్ తుకారాం ముండేను ట్యాగ్‌ చేశారు.  ఆ వీడియోలో తన ఇంట్లో తిరుగుతున్న బొద్దింకను చూపిస్తూ, ఆహార భద్రతా నిబంధనలపై చర్యలు తీసుకుంటున్న ముండేను  ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు.

కాగా ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న రెస్టారెంట్లు, క్యాంటీన్లపై కఠిన చర్యలు తీసుకుంటూ ముండే ఇటీవల సోషల్ మీడియాలో "అసలి సింగం"గా ప్రశంసలు అందుకుంటున్నారు. సదరు ఆర్డర్ లేదా డెలివరీ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను నటి ఇంకా వెల్లడించలేదు. అలాగే ఈ ఫిర్యాదుపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇంకా స్పష్టత రాలేదు.  

ఇదీ చదవండి: 14 ఏళ్ల ఐటీ జాబ్‌ వదిలి వ్యాపారం : ఇపుడు కోట్లలో ఆదాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement