సాక్షి, హైదరాబాద్: ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాం-7ను అడ్డుపెట్టుకొని ముస్లిం ఓట్లను తొలగించే యత్నం చేస్తున్నారన్నారు. ముషీరాబాద్, గోషామహల్ ప్రాంతాలలో పెద్దఎత్తున ముస్లిం ఓట్లను తొలిగించే ప్రయత్నం జరుగుతుందని ఓట్లు తొలగిస్తే ఎట్టిపరిస్థితుల్లో చూస్తూ ఊరుకోం అని హైదరాబాద్ ఎంపీ హెచ్చరించారు.
కాగా రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ అభ్యంతరాలను స్వీకరించే గడువు గత షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 16నే ముగియాల్సి ఉండగా దానిని ఈ నెల (అక్టోబరు 7) వరకు పొడిగించారు. తుది జాబితాను గత షెడ్యూల్ ప్రకారం.. అక్టోబరు 19న ప్రకటించాల్సి ఉండగా, రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు నవంబరు 9న ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.


