బీచ్‌లో విషాదం.. 8 మంది విద్యార్థుల మృతి | 8 Students From Pune Drown At Beach In Maharashtra Raigad | Sakshi
Sakshi News home page

బీచ్‌లో విషాదం.. 8 మంది విద్యార్థుల మృతి

Oct 1 2026 8:25 PM | Updated on Oct 1 2026 8:30 PM

8 Students From Pune Drown At Beach In Maharashtra Raigad

ముంబై: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దివేగర్ బీచ్‌లో సముద్రంలోకి మునిగి పుణేకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు మృతి చెందారు. మృతులంతా 16 ఏళ్ల వయసు వారేనని పోలీసులు తెలిపారు. వారి మృతదేహాలను వెలికితీశారు. పుణే జిల్లా అలందిలోని విన్నర్స్ అకాడమీ అనే ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌కు చెందిన విద్యార్థులు విహారయాత్ర కోసం దివేగర్ బీచ్‌కు వచ్చారు.

మొత్తం 48 మంది బృందం పర్యటనకు రాగా.. 25 మంది బాలురు, 17 మంది బాలికలు, ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. సాయంత్రం 5:30 గంటల సమయంలో ఎనిమిది మంది విద్యార్థులు సముద్రంలోకి వెళ్లారు. నీటి లోతు, సముద్ర ప్రవాహాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో బలమైన అలలకు కొట్టుకుపోయినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే దివేగర్‌లోని భావు మారుతి సాలుంఖే మహాకాళి వాటర్ స్పోర్ట్స్ యజమాని భావు సాలుంఖే తన బృందంతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సముద్రంలోకి వెళ్లిన వాటర్ స్పోర్ట్స్ సిబ్బంది ఎనిమిది మంది విద్యార్థుల మృతదేహాలను వెలికితీశారు. మృతులను తన్మయ్ దత్తాత్రేయ వహిలే, సుమిత్ భారత్ అహిరే, ప్రణవ్ రాందాస్ బన్సోడే, కైవల్య సతీష్ వాసంకర్, రాజ్‌వీర్ యువరాజ్ వహిలే, యశ్ కిరణ్ వాంఖడే, సోహమ్ తుకారాం భాండ్వాల్కర్, కౌస్తుభ్ సందీప్ దౌండ్గా గుర్తించారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌ షాపుల్లో ‘మేడ్ ఇన్ పాకిస్థాన్’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement