8.30 టిఫిన్‌.. 10.30 గంటలకు! | Many students in primary school fall ill | Sakshi
Sakshi News home page

8.30 టిఫిన్‌.. 10.30 గంటలకు!

Oct 1 2026 4:41 AM | Updated on Oct 1 2026 4:41 AM

Many students in primary school fall ill

పలువురు విద్యార్థులకు అస్వస్థత

పెనుబల్లి: స్కూల్‌ పిల్లలకు ఉదయం 8.30 గంటలకు పెట్టాల్సిన అల్పాహారం 10.30 గంటలకు వడ్డించారు. అంతేకాక మెగా కిచెన్‌లో తెల్లవారుజామున సిద్ధమైన టిఫిన్‌ పాఠశాలకు వచ్చేసరికి చల్లారిపోయింది. ఈ క్రమాన టిఫిన్‌ తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఉప్పలచెలక ప్రాథమిక పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది. పాఠశాలకు చెందిన విద్యార్థులు 25 మందికి ఉదయం అల్పాహారంగా ఉప్మా, చట్నీ అందజేశారు. అయితే, ఆలస్యంగా టిఫిన్‌ సమకూర్చగా, ఆ కాసేపటికి మధ్యాహ్నం భోజనం కూడా పెట్టారు. 

అనంతరం నాలుగు, ఐదు తరగతులకు చెందిన ఆరుగురు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు. టిఫిన్‌ తయారుచేశాక ఆలస్యంగా రావడంతో అది తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మధిరలో ఉన్న మెగా కిచెన్‌నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుబల్లికి టిఫిన్‌ చేరవేసేందుకు ఆలస్యమవుతోందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement