ముగిసిన ‘నైరుతి’ | Lowest rainfall in the last ten years | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘నైరుతి’

Oct 1 2026 4:38 AM | Updated on Oct 1 2026 4:38 AM

Lowest rainfall in the last ten years

గత పదేళ్లలో అత్యంత కనిష్ట వర్షపాతం... 

సీజన్‌ సగటు వర్షపాతం 74.06 సెం.మీ., కురిసింది 61.55 సెం.మీ.

15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 18 జిల్లాల్లో లోటు వర్షపాతం  

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల సీజన్‌ ముగిసింది. ప్రస్తుతం రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. గురుదాస్‌పూర్, చండీగఢ్, ముజఫర్‌ నగర్, అలీఘర్, ధోల్‌పూర్, ఉదయ్‌పూర్, దీసా, నలియా నుంచి రుతుపవనా ల ఉపసంహరణ కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల రెండోవారం చివరికల్లా ఉపసంహరణ ప్రక్రియ దేశవ్యాప్తంగా ముగిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల సీజన్‌ ఈసారి తీవ్ర నిరాశకు గురిచేసింది. 

రాష్ట్రంలో సాధారణ వర్షపాతంకంటే తక్కువగా వానలు కురిశాయి. ఈ సీజన్‌లో సగటున 74.06 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... కేవలం 61.55 సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. సాధారణం కంటే 12.51 సెంటీమీటర్ల తక్కువ వర్షపాతం నమోదైంది. సీజన్‌ ముగిసే నాటికి రాష్ట్రంలో 17 శాతం లోటు నమోదు కావడం గమనార్హం. పదేళ్లలో అతి తక్కువ వర్షాలు ఈసారి నమోదయ్యాయి. 

రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని, 18 జిల్లాల్లో లోటు పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మండలాల వారీగా వర్షపాతం పరిస్థితిని చూస్తే... ఒక మండలంలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 36 మండలాల్లో అధికం, 259 మండలాల్లో సాధారణం, 320 మండలాల్లో లోటు, 5 మండలాల్లో అత్యధిక లోటు నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement