బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికలు జరగాలి | Deputy CM Bhatti Vikramarka at the India Today South Conclave | Sakshi
Sakshi News home page

బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికలు జరగాలి

Oct 1 2026 4:21 AM | Updated on Oct 1 2026 4:21 AM

Deputy CM Bhatti Vikramarka at the India Today South Conclave

‘ఇండియా టుడే సౌత్‌ కాంక్లేవ్‌’లో డిప్యూటీ సీఎం భట్టి 

ఎన్నికల సంఘం పక్షపాత వైఖరిపై ప్రజల్లో అనుమానాలు 

ఎస్‌ఐఆర్‌పై ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలి‎‎ 

సాక్షి, హైదరాబాద్‌: బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికలు జరగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ప్రజల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఎన్నికల సంఘం పక్షపాత వైఖరిపై ప్రజల్లో అనుమానాలున్నాయని చెప్పారు. బుధవారం కేరళలోని కొచ్చిలో జరిగిన ‘ఇండియా టుడే సౌత్‌ కాన్‌క్లేవ్‌’లో ఆయన మాట్లాడారు. పార్టీలు గెలవొచ్చు.. ఓడిపోవచ్చు.. కానీ వ్యవస్థపై నమ్మకం ముఖ్యమని భట్టి అన్నారు. ‎‎ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా జరగాలని చెప్పారు. 

ఎస్‌ఐఆర్‌పై ప్రజలకున్న అనుమానాలను ఈసీ నివృత్తి చేయాలని కోరారు. ఓట్ల తొలగింపుపై పారదర్శకంగా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‎‎వేలాది ఓట్ల తొలగింపు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం కల్పించడం ఈసీ బాధ్యత అని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలకు సమాఖ్య స్ఫూర్తితో కేంద్రం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రాలు దేశానికి అందిస్తున్న సహకారాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. 

ఉచితాలుగా చూడొద్దు..
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల ను ఉచితాలుగా చూడొద్దని భట్టి‎‎ అన్నారు. సం క్షేమ పథకాలు మానవ వనరులపై పెట్టుబడులని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా అమలు చేస్తున్నామని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని, ‎‎మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితబస్సు ప్రయాణం అమలులో ఉందని చెప్పారు. 200 యూ నిట్ల వరకు ఉచిత విద్యుత్‌తో 53 లక్షల కుటుంబాలకు లబ్ధి‎‎ చే కూరుతోందని తెలిపారు. పేదలకు ఇళ్లు, విద్య, ఆరోగ్యం అందించడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం‎ చేస్తుందని పేర్కొన్నారు.  

వైఎస్సార్‌ మార్గనిర్దేశం బలపరిచింది.. 
పెట్టుబడులకు హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ఉన్నాయని డిప్యూటీ సీఎం అన్నారు. ‎‎ఓఆర్‌ఆర్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఫైనాన్షియల్‌ సిటీ, హైటెక్‌ సిటీ తెలంగాణకు బలం‎‎‎ అని గుర్తు చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డితో కలిసి పనిచేసిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతుందని, వైఎస్సార్‌ మార్గనిర్దేశం కాంగ్రెస్‌ సిద్ధాంతాలపై తనకు ఉన్న నమ్మకాన్ని బలపరిచిందని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో 100 శాతం సఖ్యతతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement