జపాన్‌కు తెలంగాణ ప్రతినిధి బృందం.. | Telangana Sports Delegation Japan Asian Games | Sakshi
Sakshi News home page

జపాన్‌కు తెలంగాణ ప్రతినిధి బృందం.. ఆసియా క్రీడల నిర్వహణపై అధ్యయనం

Sep 30 2026 11:01 PM | Updated on Sep 30 2026 11:02 PM

Telangana Sports Delegation Japan Asian Games

ఫైల్‌ఫొటో

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం ఆరు రోజుల పర్యటన కోసం జపాన్‌కు బయలుదేరింది. మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలో ఈ బృందం జపాన్‌లో పర్యటించనుంది.

ఈ ప్రతినిధి బృందంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌, స్పోర్ట్స్‌ అథారిటీ మాజీ చైర్మన్‌ శివసేన రెడ్డి, వీసీ, ఎండీ సోనీ బాలాదేవి ఉన్నారు.

జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలను వీక్షించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణ విధానాలను బృందం పరిశీలించనుంది. ముఖ్యంగా ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలు, క్రీడా వేదికల నిర్వహణ, క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ, పోటీల నిర్వహణలో అనుసరిస్తున్న సాంకేతికత తదితర అంశాలపై అధ్యయనం చేయనుంది.

జపాన్‌లో అమలు చేస్తున్న క్రీడా అభివృద్ధి విధానాలను పరిశీలించి, వాటిలో తెలంగాణకు అనువైన అంశాలను రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలను ప్రతినిధి బృందం పరిశీలించనుంది. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడంతో పాటు తెలంగాణ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement