పదేళ్లలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది: సీఎం రేవంత్‌ | CM Revanth Reddys Lashes out At BRS In Sircilla Campaign | Sakshi
Sakshi News home page

పదేళ్లలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారింది: సీఎం రేవంత్‌

Sep 30 2026 8:23 PM | Updated on Sep 30 2026 9:27 PM

CM Revanth Reddys Lashes out At BRS In Sircilla Campaign

సిరిసిల్ల: గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సిరిసిల్ల అంటే సిరులకు నిలయమని, అటువంటి సిరిసిల్లను సమస్యల వలయంగా మార్చేశారని రేవంత్‌ ధ్వజమెత్తారు. ఈ రోజు(బుధవారం, సెప్టెంబర​ 30వ తేదీ) సిరిసిల్ల పర్యటనలో భాగంగా బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్‌. 

చేనేత కార్మికుల నైపుణ్యానికి సిరిసిల్ల పెట్టింది పేరు. అగ్గిపెట్టె చీరతో నేతన్నలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. సిరిసిల్ల సీటు కోసం అమెరికా నుంచి కొడుకును దింపారు. మహేందర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వకుండా కేటీఆర్‌కు ఇచ్చారు. ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్నారు. గల్ఫ్‌ వలసలను కేసీఆర్‌ ఎందుకు ఆపలేకపోయారు.

 గల్ఫ్‌ కార్మికులు చనిపోతే కనీసం మృతదేహాలు తీసుకొచ్చేందుకు సహకరించలేదు. ఒక్కరోజు కూడా గల​్ఫ్‌ బాధితుల గురించి కేసీఆర్‌ కుటుంబం పట్టించుకోలేదు. మా ప్రభుత్వం గల్ఫ్‌ బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం చేస్తోంది. తండ్రీ-కొడుకులను గెలిపిస్తే లక్ష కోట్లు సంపాదించుకున్నారు’ అని విమర్శించారు సీఎం రేవంత్‌.

ఇదీ చదవండి: మానవ నమ్మకాలతోనే సైబర్ దాడి!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement