రెండు ఇళ్ల మధ్య అడుగు కూడా లేని ఇరుకైన సందులో 70 ఏళ్ల వృద్ధుడు చిక్కుకుపోయాడు. బయటకు వచ్చే మార్గం లేక ప్రాణాలతో పోరాడుతున్న ఆయనను పాల్ఘర్ అగ్నిమాపక సిబ్బంది గోడను బద్దలుకొట్టి సాహసోపేతంగా రక్షించారు. శనివారం తెల్లవారుజామున మహారాష్ట్ర పాల్ఘర్‌లోని నవ్లీ ప్రాంతంలోని భీమాయ్ నగర్‌లో ఈ ఘటన కలకలం రేపింది.
పాల్ఘర్‌కు చెందిన వినోద్ విష్ణు జాధవ్ రెండు ఇళ్ల గోడల మధ్య చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది చేపట్టిన ఈ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో సిబ్బంది ఎంతో జాగ్రత్తగా వృద్ధుడిని బయటకు తీసుకువస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే పాల్ఘర్ ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరుకైన ఖాళీ నుంచి నేరుగా అతడిని బయటకు తీసుకురావడం సాధ్యం కాదని గుర్తించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఒక ఇంటి గోడను పగులగొట్టి, జాధవ్‌ను బయటకు తీసేందుకు మార్గాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది వినోద్ జాధవ్‌ను ఆ ఇరుకైన ప్రదేశం నుంచి బయటకు తీసుకువచ్చారు. వృద్ధుడిని రక్షించిన అనంతరం ఆయన్ని వైద్య పరీక్షలు కోసం పాల్ఘర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: నోయిడాలో షాకింగ్ ఘటన..
#Maharashtra #Palghar- 70-Year-Old Man Trapped Between Two Houses Rescued by Fire Crew After Wall is Broken Down; Palghar: Around 4 AM in Bhimai Nagar, Navali, 70-year-old Vinod Vishnu Jadhav became trapped in a gap of less than one foot between two houses. Upon receiving the… pic.twitter.com/xdKrUXyMff
— Siraj Noorani (@sirajnoorani) October 2, 2026


