సోషల్ మీడియాలో రీల్స్‌కోసం వెర్రి వేషాలు వేస్తూ, దిగజారిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇంటర్నెట్ పాపులారిటీ, లైక్స్ , వ్యూస్" కోసం ఒక మహిళ చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె తీరుపై నెటిజన్లు మండి పడుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే...
చీర కట్టుకుని రైలు పట్టాలపై నిలబడి రొమాంటిక్ రీల్ చేసింది. అక్కడితో ఆగిపోలేదు. తన చీర కొంగును రైలు ముందు భాగానికి కట్టేసి మరీ రీల్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్న పాటకు వయ్యారంగా ఆమె లిప్ సింక్ ఇచ్చింది. 'Nalanda_index' అనే హ్యాండిల్‌లో ఈ వీడియో పోస్ట్ అయింది. సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం కొందరు తమ ఇతరుల భద్రతను, బాధ్యతను గాలికి వదిలేస్తున్నారని, కెమెరా ఆన్ చేయగానే మానవత్వం మరిచిపోతున్నారని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ట్యాగ్ చేస్తూ డిమాండ్ చేశారు. ఇది చాలా హాస్యాస్పదం, అసలు వీళ్లకి అనుమతి ఎలా లభిస్తోంది, ఆన్‌లైన్ పాపులారిటీ పేరుతో మన దేశంలో ఏం జరుగుతోంది? అని మరొకరు వ్యాఖ్యానించారు.
रील बनाने की होड़ लोगों को सिर्फ मानसिक रूप से ही नहीं, बल्कि सामाजिक रूप से भी दिवालिया बना रही है।
कुछ लाइक्स और व्यूज़ के लिए लोग अपनी समझ, शर्म और जिम्मेदारी तक दांव पर लगाने लगे हैं।
कभी-कभी लगता है, कैमरा चालू होते ही इंसानियत बंद हो जाती है। 📱🎥 pic.twitter.com/twWXJ8n5hm— The Nalanda Index (@Nalanda_index) October 1, 2026
ఇదీ చదవండి: కస్టడీ పోరు : నాలుగేళ్లపాపను కాల్చి చంపి, ఆత్మహత్య
కొద్ది రోజుల క్రితం బిహార్‌లోని భక్తియార్‌పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై ఒక మహిళ కూల్ డ్రింక్ బాటిల్‌ను తన తలపై బోలించుకుంటూ మరో విచిత్రమైన రీల్ చేసిన వీడియో కూడా ఇలాగే వైరల్ అయింది.
ఇదీ చదవండి: జేబులో రూ.100 అకౌంట్‌లో రూ. లక్ష : స్టాండప్ కమెడియన్ సక్సెస్ స్టోరీ


