ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ వ్యక్తిగత జీవితంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనతో రిలేషన్‌షిప్‌లో ఉన్న శివోన్ జిలిస్ బ్రేకప్ విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే తమ బంధం అకస్మాత్తుగా ముగిసిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మస్క్ తనను ఎక్స్‌లో అన్‌ఫాలో చేసిన తర్వాత ఆమె ఈ విషయంపై భావోద్వేగంగా స్పందించారు.
ఎలాన్ మస్క్ తాజా మాజీ ప్రేయసి శివోన్ జిలిస్ తాజాగా సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు. మస్క్‌తో వారం కిందట జరిగిన చాట్ స్క్రీన్‌షాట్‌ను కూడా ఆమె షేర్ చేశారు. సెప్టెంబర్ 24న జరిగిన ఆ సంభాషణలో.. ‘‘నిన్ను బ్రేక్‌ఫాస్ట్‌లో చూడటం చాలా ఆనందంగా ఉంది. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను’’ అని జిలిస్ రాయగా.. మస్క్ కూడా ‘‘లవ్ యూ టూ’’ అని బదులిచ్చారు.
ఆ తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కోసం వైట్‌హౌస్‌లో జరిగిన స్టేట్ డిన్నర్‌కు ఆమెను ఆహ్వానించవచ్చనే విషయం తనకు అప్పటివరకు తెలియదని మస్క్ చెప్పినట్లు జిలిస్ వెల్లడించారు. సెప్టెంబర్ 27న ఆమె ‘‘కొత్త రోజు.. కొత్త జీవితం’’ అంటూ మరో పోస్ట్ చేశారు. అయితే ఇందులోనే ఆమె బ్రేకప్ విషయాన్ని కూడా ప్రస్తావించారు.
It’s hard to go from in love to let go in a week with no warning, but that’s just how it is sometimes 🤷🏻♀️
I feel happy that I got to show Elon how it feels to be deeply understood, nurtured, and peacefully loved with stability and gentleness. Given the tumultuous nature of his… https://t.co/HAOfjxrIig pic.twitter.com/lgL0GVzD2R— Shivon Zilis (@shivon) October 2, 2026
‘‘ప్రేమలో ఉండటం నుంచి వారం రోజుల్లోనే ఎలాంటి హెచ్చరిక లేకుండా విడిపోవాల్సి రావడం కష్టం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు ఇలాగే ఉంటాయి’’ అని జిలిస్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనితో పాటు మస్క్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ జిలిస్ భావోద్వేగానికి గురయ్యారు.
మస్క్ బాల్యం, తొలి జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగిందని, ఆయన తరచూ మానసికంగా ఎంతో వేదన అనుభవించే వ్యక్తిగా ఉండేవారని ఆమె పేర్కొన్నారు. తాను, తమ పిల్లలు ఆయనకు ఒక సురక్షితమైన స్థలంగా ఉండేవారమని.. అక్కడ కొంత సమయం గడిపి మళ్లీ తన పనుల కోసం వెళ్లేవారని వివరించారు.
‘‘నేను ఎలాన్‌ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఆయన నుంచి ఎన్నో జీవితాలకు సరిపడే జ్ఞానాన్ని నేర్చుకున్నాను’’ అని జిలిస్ రాసుకొచ్చారు. ఈ విడిపోవడం తనకు ఎంతో నష్టాన్ని మిగిల్చిందని చెబుతూనే.. మస్క్‌తో కలిసి తమ జీవితాల్లోకి వచ్చిన నలుగురు పిల్లలే తనకు అందమైన జ్ఞాపకాలని పేర్కొన్నారు. ‘‘నేను బాధలో ఉన్నాను. కానీ ఎలాన్‌పై నాకు ఎంతో శ్రద్ధ ఉంది. ఆయన సంతోషంగా ఉండాలని ఎప్పటికీ కోరుకుంటాను’’ అని ఆమె తెలిపారు.
మస్క్, జిలిస్ 2020 నుంచి బంధంలో ఉన్నట్లు తెలిసిందే. సన్నిహిత సంబంధంలోకి వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 2021లో వారికి కవలలు స్ట్రైడర్, అజూర్ జన్మించారు. 2024లో ఆర్కాడియా అనే కుమార్తె, 2025లో సెల్డన్ జన్మించారు. వీరిద్దరికీ నలుగురు పిల్లలు ఉన్నారు.
ఇక.. మస్క్‌కు మొత్తం కనీసం 14 మంది పిల్లలు ఉన్నారు. వీరు నలుగురు వేర్వేరు భాగస్వాములతో ఉన్న సంబంధాల ద్వారా జన్మించారు. తన తొలి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆయనకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో ట్విన్స్ వివియన్, గ్రిఫిన్, ట్రిప్లెట్స్ కై, సాక్సన్, డామియన్ ఉన్నారు. అయితే తొలి సంతానం నెవాడా అలెగ్జాండర్ మస్క్ 10 వారాల వయసులోనే మరణించారు.
ఇక జిలిస్ చేసిన బ్రేకప్ ప్రకటనపై మస్క్ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. ఆయన నోరు విప్పితేనే.. ఈ వారం గ్యాప్‌లో ఏం జరిగిందనేదానిపై క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.
ఇదీ చదవండి: హమామ్.. మాములోడు కాదుగా!


