ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన ప్రవాస శక్తిగా భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మాతృదేశం దాటి సుదూర తీరాల్లో స్థిరపడిన కోట్లాది మంది భారతీయులు నేడు వివిధ దేశాల ఆర్థిక, సాంకేతిక, సామాజిక విభాగాల్లో దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ఉన్నత సాంకేతిక కేంద్రాల నుంచి గల్ఫ్ దేశాల నిర్మాణ, సేవా రంగాలు, ఆసియా-ఆఫ్రికా దేశాల చారిత్రక వర్తక కేంద్రాల వరకు భారతీయుల పాత్ర విశిష్టమైనది. విదేశాంగ శాఖ సేకరించిన తాజా అధికారిక గణాంకాల ప్రకారం వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయుల వివరాలు చూద్దాం.
భారత విదేశాంగ శాఖ సేకరించిన అధికారిక గణాంకాల ప్రకారం అత్యధికంగా భారతీయులు నివసిస్తున్న టాప్-10 దేశాల జాబితా కింది విధంగా ఉంది.
ఇదీ చదవండి: నేలవాలిన అపరంజి ధరలు
| స్థానం | దేశం | ప్రవాస భారతీయులు |
|---|---|---|
| 1 | అమెరికా | 6.1 మిలియన్లు (61 లక్షలు) |
| 2 | యూఏఈ | 4.3 మిలియన్లు (43 లక్షలు) |
| 3 | కెనడా | 3.2 మిలియన్లు (32 లక్షలు) |
| 4 | మలేషియా | 2.9 మిలియన్లు (29 లక్షలు) |
| 5 | సౌదీ అరేబియా | 2.8 మిలియన్లు (28 లక్షలు) |
| 6 | మయన్మార్ | 2.0 మిలియన్లు (20 లక్షలు) |
| 7 | దక్షిణాఫ్రికా | 1.8 మిలియన్లు (18 లక్షలు) |
| 8 | శ్రీలంక | 1.6 మిలియన్లు (16 లక్షలు) |
| 9 | యునైటెడ్ కింగ్డమ్ | 1.3 మిలియన్లు (13 లక్షలు) |
| 10 | కువైట్ | 1.0 మిలియన్ (10 లక్షలు) |


