విజయ్ మాల్యా చెప్పేదంతా అబద్ధం.. అసలు నిజం ఇదే.. | Vijay Mallya Still Owes Rs 8752 Cr SBI Counters Debt Recovery Bombay HC | Sakshi
Sakshi News home page

విజయ్ మాల్యా చెప్పేదంతా అబద్ధం.. అసలు నిజం ఇదే..

Oct 3 2026 9:20 AM | Updated on Oct 3 2026 10:43 AM

Vijay Mallya Still Owes Rs 8752 Cr SBI Counters Debt Recovery Bombay HC

పరారీలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యా బ్యాంకుల బకాయిలకు సంబంధించి బొంబాయి హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంకుల కన్సార్టియంకు చెల్లించాల్సిన అసలు, వడ్డీ మొత్తాలు పూర్తిగా రికవరీ అయ్యాయంటూ మాల్యా చేస్తున్న వాదనలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల బ్యాంకింగ్ కన్సార్టియం ఖండించింది. ఈ మేరకు బొంబాయి హైకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

డెట్ రికవరీ ఆఫీసర్ ద్వారా ఇప్పటివరకు రూ.10,270 కోట్లను తాత్కాలికంగా రికవరీ చేసినప్పటికీ ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి మాల్యా నుంచి ఇంకా రూ.8,751.86 కోట్ల మేర బకాయిలు రాబట్టాల్సి ఉందో బ్యాంకులు స్పష్టం చేశాయి. డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ)లో దావా వేయడానికి ముందే రూ.544.58 కోట్లు రికవరీ కాగా న్యాయపరమైన ఇతర ఖర్చులను మినహాయించి ఈ ఏడాది జనవరిలో దాఖలు చేసిన అఫిడవిట్ నాటికి రూ.8,135.63 కోట్లు బకాయిలు ఉన్నట్లు బ్యాంకులు పేర్కొన్నాయి. వడ్డీ పెరగడంతో ఆగస్టు చివరి నాటికి ఈ మొత్తం రూ.8,751.86 కోట్లకు చేరిందని కన్సార్టియం వివరించింది.

మాల్యా వాదనలు భిన్నంగా..

తమ నుంచి బ్యాంకులు ఇప్పటికే అసలు కంటే ఎక్కువ మొత్తాన్ని రికవరీ చేసుకున్నాయని, కాబట్టి తనపై ఉన్న నేరపూరిత కేసులను కొట్టివేయాలని కోరుతూ మాల్యా 2020లో బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాదనలు వినిపించిన అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ ఈ తాజా జవాబు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం అక్టోబర్ 13కు వాయిదా వేసింది. బ్యాంకులకు రూ.8,700 కోట్లకు పైగా ఇంకా చెల్లించాల్సి ఉందన్న ఈ అధికారిక ప్రకటనతో మాల్యా న్యాయపోరాటానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

ఇదీ చదవండి: స్కూల్ పుస్తకాల్లో ‘ఇన్‌కమ్ టాక్స్’ పాఠాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement