బజాజ్‌ ఫైనాన్స్‌ నిధుల సమీకరణ  | NBFC Bajaj Finance to raise up to Rs 17,500 crore through QIP, warrants | Sakshi
Sakshi News home page

బజాజ్‌ ఫైనాన్స్‌ నిధుల సమీకరణ 

Oct 3 2026 5:11 AM | Updated on Oct 3 2026 5:11 AM

NBFC Bajaj Finance to raise up to Rs 17,500 crore through QIP, warrants

రూ. 17,500 కోట్లపై కన్ను 

క్విప్, వారంట్ల జారీకి రెడీ

ముంబై: ప్రయివేట్‌ రంగ ఎన్‌బీఎఫ్‌సీ దిగ్గజం బజాజ్‌ ఫైనాన్స్‌ నిధుల సమీకరణ బాట పట్టింది. అర్హతగల సంస్థాగత ఇన్వెసర్లకు షేర్ల జారీ(క్విప్‌)తోపాటు ప్రిఫరెన్షియల్‌ వారంట్ల జారీ ద్వారా రూ. 17,500 కోట్లు సమీకరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకు కంపెనీ బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. 

తాజా ప్రతిపాదన ప్రకారం క్విప్‌ ద్వారా రూ. 11,700 కోట్లు సమకూర్చుకోనున్నట్లు తెలియజేసింది. మరో రూ. 5,800 కోట్ల విలువైన వారంట్లను ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన జారీ చేయనున్నట్లు వివరించింది. వీటిని అదే సంఖ్యలో ఈక్విటీ షేర్లుగా మారి్పడి చేసుకునేందుకు వీలుంటుందని పేర్కొంది. క్విప్‌లో భాగంగా రూ. 1 ముఖ విలువగల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement