అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా కొనసాగింపు
ఆర్‌బీఐ తాజా జాబితాలో 17 కంపెనీలు
ముంబై: ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన అప్పర్‌లేయర్ నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల(ఎన్‌బీఎఫ్‌సీలు)ల జాబితాలో టాటా సన్స్‌కు మరోసారి చోటిచ్చింది. ఎన్‌బీఎఫ్‌సీ రిజి్రస్టేషన్‌ను వొదులుకునేందుకు టాటా సన్స్ చేసుకున్న దరఖాస్తు పరిశీలనలో ఉన్నప్పటికీ అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీ హోదాను కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. అయితే ఈ అంశం టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ డీరిజిస్ట్రేషన్‌కు అడ్డంకికాబోదని స్పష్టం చేసింది. నిజానికి 2022లో టాటా సన్స్ అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందింది. దీంతో మరింత కఠిన నియంత్రణా సంబంధ నిబంధనలను కంపెనీ పాటించవలసి ఉంటుంది.
నియమిత కాలంలో స్టాక్ ఎక్సే్చంజీలలో లిస్టింగ్‌సహా.. కార్పొరేట్ గవర్నెన్స్, కనీస మూలధనం, రిస్కుల నిర్వహణ తదితర అంశాలలో నిబంధనలు అమలు చేయవలసి ఉంటుంది. అయితే కంపెనీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టడంతో ఆర్‌బీఐ గుర్తింపునుంచి మినహాయింపును కోరుతోంది. దీనిలో భాగంగా ఇన్వెస్ట్‌మెంట్ కార్యకలాపాలను విడదీయడం, రుణాలను తగ్గించుకోవడం, ఫైనాన్షియల్ సరీ్వసుల బిజినెస్ విభాగాలను పునర్‌వ్యవస్థీకరించడం తదితరాలను చేపట్టింది. ఇతర ఎన్‌బీఎఫ్‌సీలతో పోలిస్తే కంపెనీ ప్రధానంగా టాటా గ్రూప్‌లో పెట్టుబడుల నిర్వహణతో హోల్డింగ్ దిగ్గజంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
తాజా జాబితా ఇదీ..
ఆర్‌బీఐ 17 కంపెలతో తాజా జాబితాను విడుదల చేసింది. టాటా సన్స్‌సహా.. పీఎస్‌యూలు ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, ఐఆర్‌ఎఫ్‌సీ, హడ్కో చేరాయి. ఇంకా ఈ జాబితాలో డిపాజిట్లు స్వీకరించే ఎన్‌బీఎఫ్‌సీలు.. బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ హౌసింగ్, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి. డిపాజిట్లు స్వీకరించని ఎన్‌బీఎఫ్‌సీ జాబితాలో టాటా క్యాపిటల్, చోళమండలం ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్, ఏబీ క్యాపిటల్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్, పిరమల్ ఫైనాన్స్‌కు చోటు లభించింది. కాగా.. ఇంతక్రితం ప్రకటించిన జాబితాలో పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, సమ్మాన్ క్యాపిటల్‌కు అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీ గుర్తింపు ఇచ్చినప్పటికీ నిబంధనలు పాటించలేదని ఆర్‌బీఐ పేర్కొంది. అయితే వీటిని ఈ జాబితాలో కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.


