భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన ఫ్రీడమ్ 2.0 పథకం కింద 2026 స్వాతంత్య్ర దినోత్సవం కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌లో భాగంగా.. వినియోగదారులు కేవలం రూ.1కే కొత్త బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును పొందవచ్చు.
ఈ ఆఫర్ ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త వినియోగదారులు రోజూ 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్ కాలింగ్‌ను కూడా పొందుతారు. వ్యాలిడిటీ 24 రోజులు మాత్రమే. కొత్త సిమ్ కనెక్షన్ కోసం అధిక మొత్తం చెల్లించకుండా బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రయత్నించాలనుకునే వినియోగదారులకు ఈ ఆఫర్ ఉపయోగకరంగా ఉంటుంది.
This Independence Day, why not start something better?
Your first step towards a better connection is here.#BSNLIndia #StayConnected #InternetForEveryone #DigitalLife #IndiaOnline #BSNLServices #SmartIndia #EverydayConnectivity #IndependenceOffer #FRC1 @CMDBSNL @robertravi21 pic.twitter.com/HObE4inHxD— BSNL India (@BSNLCorporate) August 12, 2026
రూ.2,399 ప్లాన్!
బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 412 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకి 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందవచ్చు. ఆఫర్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు అపరిమిత కాల్స్ ఆస్వాదించవచ్చు. అయితే ఈ ఆఫర్ కూడా కేవలం సెప్టెంబర్ 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.
నిజానికి చాలా కంపెనీలు యాన్యువల్ ప్లాన్ కింద 365 రోజుల వ్యాలిడిటీ మాత్రమే అందిస్తాయి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం మరో 47 రోజుల వ్యాలిడిటీని అదనంగా అందిస్తుంది. అంటే ఏడాది పూర్తయినా ఇంకా కొన్ని రోజులు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


