భారత్‌లో ఏఎంసీఏ ఇంజిన్లపై కసరత్తు
న్యూఢిల్లీ: అధునాతన అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) కోసం స్వదేశీ ఇంజిన్‌ను రూపొందించే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్, రోల్స్–రాయిస్ చేతులు కలిపాయి. ఇందుకోసం భారత్‌లో ప్రత్యేకంగా ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్‌ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించనున్నట్లు ఇరు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
ఇది కంబాట్ ఇంజిన్ల డిజైనింగ్, అభివృద్ధి, తయారీ, టెస్టింగ్‌తో పాటు ప్రొపల్షన్ టెక్నాలజీకి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా నిలుస్తుందని పేర్కొన్నాయి. అత్యంత కీలకమైన సాంకేతిక సామర్థ్యాలను భారత్ సొంతంగా సాధించుకోవడం ముఖ్యమని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తెలిపారు. రక్షణ, పౌర విమానయానం తదితర రంగాలు, ప్రొపల్షన్ సిస్టమ్స్ మొదలైన విభాగాల్లో విస్తృత భాగస్వామ్యానికి ఈ ఒప్పందం తోడ్పడగలదని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. భారత్‌లో పటిష్టమైన ఏరోస్పేస్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ఇదొక కీలక మైలురాయని రోల్స్ రాయిస్ సీఈవో ట్యుఫాన్ ఎర్గిన్‌బిల్జిక్ తెలిపారు.


