పిఠాపురం ప్రిస్కిల్లాను చంపేశారా..! | Pitapuram Bajaj Finance Girl Priscilla Incident | Sakshi
Sakshi News home page

పిఠాపురం ప్రిస్కిల్లాను చంపేశారా..!

Jul 29 2026 11:13 AM | Updated on Jul 29 2026 11:20 AM

Pitapuram Bajaj Finance Girl Priscilla Incident

గొల్లప్రోలు (పిఠాపురం రూరల్‌): ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గొల్లప్రోలులో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లప్రోలు రైల్వే స్టేషన్‌ సమీపాన నివాసం ఉంటున్న తండి ప్రిస్కిల్లా (27) కాకినాడలోని ఎస్‌ఆర్‌ఎంటీ మాల్‌లో ఉన్న రిలయన్స్‌ డిజిటల్‌లో బజాజ్‌ ఫైనాన్స్‌ సేల్స్‌ ఆఫీసర్‌గా పని చేస్తుంది. 

మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు గుర్తించారు. స్థానికుల సహాయంతో ఆమెను వెంటనే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement