కోడింగ్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలు వృథా.. టెకీ ఆవేదన! | US Job Market Slump Forces Bengaluru Techie to Return Home Empty Handed | Sakshi
Sakshi News home page

కోడింగ్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూలు వృథా.. టెకీ ఆవేదన!

Jul 29 2026 9:47 AM | Updated on Jul 29 2026 9:48 AM

US Job Market Slump Forces Bengaluru Techie to Return Home Empty Handed

బెంగళూరు: అమెరికాలో ఉద్యోగ వేట విఫలమై, నెలల తరబడి ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కక బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన మోహిత్ ఆర్. గౌడ అనే యువకుడు తన అనుభవాలను లింక్డ్‌ఇన్ వేదికగా పంచుకున్నారు. కష్టపడి చదివి, ఎన్నో త్యాగాలు చేస్తే భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన తనకు, అక్కడి వాస్తవ పరిస్థితులు తీవ్ర నిరాశను మిగిల్చాయని ఆయన పేర్కొన్నారు.

వందలాది ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తూ, కోడింగ్ పరీక్షలు, ఇంటర్వ్యూల కోసం రాత్రింబవళ్లు శ్రమించినా, చివరికి నిరాశే ఎదురైందని మోహిత్ తెలిపారు. స్వదేశానికి తిరిగి రావడం తన ప్రణాళికలో లేదని, ఈ నిర్ణయం ఎంతో వేదనను, అనిశ్చితిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ వేటలో ఉన్న సమయంలో పొదుపు చేసుకున్న సొమ్మంతా క్రమంగా కగిపోవడం ఆర్థికంగా ఎంతో కుంగదీసిందని వాపోయారు. అయినప్పటికీ నిరాశను పక్కనపెట్టి, కృత్రిమ మేధస్సు , జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ రంగాల్లో ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, తగిన అవకాశాలు ఉన్నవారు రిఫరల్స్ ద్వారా సహకరించాలని కోరారు.

ఇది కూడా చదవండి: మోనాలీసాను బలవంతంగా తరలించొద్దు: హైకోర్టు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement