హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ప్రతి ఏడాది నిర్వహించే ఫ్యాన్స్ మీట్..(Allu Arjun Fans Meet) మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాడు.
అభిమానులతో కలిసి ముచ్చటించాడు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 600 మందికి పైగా అభిమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అభిమానులు చూపుతున్న అమితమైన ఆప్యాయతకు బన్నీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అనంతరం వారితో కలిసి గ్రూప్ ఫొటోలు దిగుతూ ఎంతో ఉత్సాహంగా గడిపారు.
ఈ సమావేశంతో అభిమానులకు, ఐకాన్ స్టార్‌కు మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడింది.
Photo Credit : Twitter (X)


