breaking news
heroic action
-
Viral Video: రెండు ఇళ్ల గోడల మధ్య ఇరుక్కున్న వృద్ధుడు
రెండు ఇళ్ల మధ్య అడుగు కూడా లేని ఇరుకైన సందులో 70 ఏళ్ల వృద్ధుడు చిక్కుకుపోయాడు. బయటకు వచ్చే మార్గం లేక ప్రాణాలతో పోరాడుతున్న ఆయనను పాల్ఘర్ అగ్నిమాపక సిబ్బంది గోడను బద్దలుకొట్టి సాహసోపేతంగా రక్షించారు. శనివారం తెల్లవారుజామున మహారాష్ట్ర పాల్ఘర్లోని నవ్లీ ప్రాంతంలోని భీమాయ్ నగర్లో ఈ ఘటన కలకలం రేపింది.పాల్ఘర్కు చెందిన వినోద్ విష్ణు జాధవ్ రెండు ఇళ్ల గోడల మధ్య చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది చేపట్టిన ఈ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో సిబ్బంది ఎంతో జాగ్రత్తగా వృద్ధుడిని బయటకు తీసుకువస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.సమాచారం అందుకున్న వెంటనే పాల్ఘర్ ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇరుకైన ఖాళీ నుంచి నేరుగా అతడిని బయటకు తీసుకురావడం సాధ్యం కాదని గుర్తించారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఒక ఇంటి గోడను పగులగొట్టి, జాధవ్‌ను బయటకు తీసేందుకు మార్గాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది వినోద్ జాధవ్‌ను ఆ ఇరుకైన ప్రదేశం నుంచి బయటకు తీసుకువచ్చారు. వృద్ధుడిని రక్షించిన అనంతరం ఆయన్ని వైద్య పరీక్షలు కోసం పాల్ఘర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఇదీ చదవండి: నోయిడాలో షాకింగ్ ఘటన..#Maharashtra #Palghar- 70-Year-Old Man Trapped Between Two Houses Rescued by Fire Crew After Wall is Broken Down; Palghar: Around 4 AM in Bhimai Nagar, Navali, 70-year-old Vinod Vishnu Jadhav became trapped in a gap of less than one foot between two houses. Upon receiving the… pic.twitter.com/xdKrUXyMff— Siraj Noorani (@sirajnoorani) October 2, 2026 -
ఎదురుగా షార్క్.. సముద్రంలో భయానక దృశ్యం
ఫ్లోరిడాలోని ఎమరాల్డ్ తీరంలో పెను విషాదమే తప్పింది. ఓ భారీ షార్క్ బోటు డైవర్‌పై దాడి చేయగా.. బోట్ కెప్టెన్ జాకబ్ జాన్సన్ సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. 'న్యూయార్క్ పోస్ట్' కథనం ప్రకారం.. ఈ ఘటన సముద్రంలో దాదాపు 30 మైళ్ల దూరంలో జరిగింది. బోటు డైవర్ నీటిలో ఉన్న సమయంలో షార్క్ అతడిపై తీవ్రంగా దాడి చేసింది. ఆ వ్యక్తి ప్రాణాల కోసం షార్క్‌తో పోరాడారు.తీవ్రమైన గాయాలు కావడంతో అతడు బోటులోకి ఎక్కలేకపోయాడు. వెంటనే జాన్సన్ సాహసంతో నీటిలోకి దూకి, తీవ్రంగా గాయపడిన ఆ డైవర్‌ను షార్క్ బారి నుండి రక్షించి బోట్ పైకి లాగాడు. పడవలోకి తీసుకొచ్చిన వెంటనే రక్తస్రావం జరగకుండా ప్రాథమిక చికిత్స అందించారు. అదే సమయంలో వైద్యులకు సమాచారం అందిస్తూ పడవను వేగంగా తీరం వైపు తీసుకెళ్లారు.జాన్సన్ కారణంగా ఆ డైవర్‌ను ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం అతడిని అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి సమయం లేదు. నేను వెంటనే నీటిలోకి దూకాను. రక్షించే ప్రయత్నం చేశానని జాన్సన్ గుర్తుచేసుకున్నాడు. మొదట చిన్న ప్రమాదమేనని భావించా.. ట్రిగ్గర్ ఫిష్ ఏమైనా కరిచిందేమోనని అతడిని ఆట పట్టిద్దామని బోట్ అంచు నుంచి కిందకు చూశాను. కానీ, అతడి చుట్టూ రక్తం మడుగులా ఉందని ఆయన పేర్కొన్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ కాగా, జాన్సన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారుజ -
‘26/11 వీరోచిత చర్య’
వాషింగ్టన్: భారత్ లోని ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి (26/11) ఒక వీరోచితమైన చర్యగా అల్‌కాయిదా వ్యవస్థాపకుడు ఒసామాబిన్ లాడెన్ అభివర్ణించాడు. పాకిస్తాన్ నేతృత్వంలో లష్కర్ ఏ తోయిబా నిర్వహించిన ఆపరేషన్ ఒక అద్భుతమని పేర్కొన్నాడు. పాక్‌లో 2011 మే 2 న లాడెన్‌ను హతమార్చినప్పుడు అక్కడ దొరికిన వేలాది డాక్యుమెంట్లను అమెరికా డీకోడ్ చేసింది. వీటిలోని కొన్ని పత్రాలను బుధవారం విడుదల చేసింది. ‘మన లక్ష్యం అమెరికా కావాలి.. అంతే కానీ, ముస్లిం సమాజం మధ్య అంతర్గత యుద్ధాన్ని సృష్టించవద్దు’ అని లాడెన్ తన అనుచరులను హెచ్చరించినట్లు ఓ పత్రంలో ఉంది.


