ఫ్లోరిడాలోని ఎమరాల్డ్ తీరంలో పెను విషాదమే తప్పింది. ఓ భారీ షార్క్ బోటు డైవర్‌పై దాడి చేయగా.. బోట్ కెప్టెన్ జాకబ్ జాన్సన్ సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. 'న్యూయార్క్ పోస్ట్' కథనం ప్రకారం.. ఈ ఘటన సముద్రంలో దాదాపు 30 మైళ్ల దూరంలో జరిగింది. బోటు డైవర్ నీటిలో ఉన్న సమయంలో షార్క్ అతడిపై తీవ్రంగా దాడి చేసింది. ఆ వ్యక్తి ప్రాణాల కోసం షార్క్‌తో పోరాడారు.
తీవ్రమైన గాయాలు కావడంతో అతడు బోటులోకి ఎక్కలేకపోయాడు. వెంటనే జాన్సన్ సాహసంతో నీటిలోకి దూకి, తీవ్రంగా గాయపడిన ఆ డైవర్‌ను షార్క్ బారి నుండి రక్షించి బోట్ పైకి లాగాడు. పడవలోకి తీసుకొచ్చిన వెంటనే రక్తస్రావం జరగకుండా ప్రాథమిక చికిత్స అందించారు. అదే సమయంలో వైద్యులకు సమాచారం అందిస్తూ పడవను వేగంగా తీరం వైపు తీసుకెళ్లారు.
జాన్సన్ కారణంగా ఆ డైవర్‌ను ప్రాణాలతో బయటపడ్డాడు. అనంతరం అతడిని అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి సమయం లేదు. నేను వెంటనే నీటిలోకి దూకాను. రక్షించే ప్రయత్నం చేశానని జాన్సన్ గుర్తుచేసుకున్నాడు. మొదట చిన్న ప్రమాదమేనని భావించా.. ట్రిగ్గర్ ఫిష్ ఏమైనా కరిచిందేమోనని అతడిని ఆట పట్టిద్దామని బోట్ అంచు నుంచి కిందకు చూశాను. కానీ, అతడి చుట్టూ రక్తం మడుగులా ఉందని ఆయన పేర్కొన్నాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్ కాగా, జాన్సన్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారుజ


