షాకింగ్‌ వీడియో.. ఎయిర్‌షోలో కుప్పకూలిన విమానం | Greek F 4 Phantom Fighter Jet Crashes During Airshow Near Athens | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ వీడియో.. ఎయిర్‌షోలో కుప్పకూలిన విమానం

Sep 6 2026 7:51 AM | Updated on Sep 6 2026 7:52 AM

Greek F 4 Phantom Fighter Jet Crashes During Airshow Near Athens

ఏథెన్స్ సమీపంలోని ఓ వైమానిక స్థావరంలో ఎయిర్‌ షోలో భాగంగా ఆకాశంలో చక్కర్లు కొడుతున్న గ్రీక్‌ F-4 ఫాంటమ్ యుద్ధ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. విమానంలోని పైలట్లు ప్రమాదానికి ముందు విమానం నుంచి బయటకు వచ్చేందుకు ఉపయోగించే ఎజెక్షన్ సీట్లను వినియోగించలేకపోయారు.

ఏథెన్స్‌కు ఉత్తరంగా ఉన్న తనాగ్రా ఎయిర్‌బేస్‌లో వార్షిక కార్యక్రమం జరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తక్కువ ఎత్తులో విన్యాసం చేస్తూ కూలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం నేలను ఢీకొన్న వెంటనే భారీ పేలుడు సంభవించి.. నల్లటి పొగ వ్యాపించింది. ఆ సమయంలో వేలాది మంది ప్రేక్షకులు ఎయిర్‌షోను వీక్షిస్తున్నారు. అయితే ప్రేక్షకుల్లో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.

మంటలను అదుపులోకి తీసుకురావడానికి 11 అగ్నిమాపక విమానాలు, హెలికాప్టర్లు, అలాగే సుమారు 85 మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు సమీపంలోని అడవికి కూడా వ్యాపించాయి. ప్రమాదం అనంతరం  కార్యక్రమాలను రద్దు చేశారు. గ్రీక్‌ రక్షణ మంత్రి నికోస్ డెండియాస్ తన థెస్సలోనికీ పర్యటనను రద్దు చేసుకుని ప్రమాద స్థలానికి వెళ్లారు. గ్రీక్‌ వైమానిక దళం మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement