మంటలార్పుతూ ఢీకొన్న హెలికాప్టర్లు  | Two die after helicopters collide mid-air in Greece | Sakshi
Sakshi News home page

మంటలార్పుతూ ఢీకొన్న హెలికాప్టర్లు 

Aug 3 2026 5:35 AM | Updated on Aug 3 2026 5:35 AM

Two die after helicopters collide mid-air in Greece

గ్రీస్‌లో ఇద్దరు మృతి 

ఏథెన్స్‌: గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌ పశ్చిమాన ఉన్న సాతా వద్ద తీవ్రమైన కార్చిచ్చును అదుపు చేసే క్రమంలో రెండు అగ్నిమాపక హెలికాప్టర్లు పొరపాటున గాల్లోనే ఢీకొన్నాయి. వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నేలకూలిన ఆ రెండు హెలికాప్టర్లలోని నలుగురు సిబ్బందిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

 వీరిలో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. అగ్నిమాపక శాఖ లీజుకు తీసుకున్న రెండు బెల్‌ హెలికాప్టర్లు ఎలెఫ్సినా సైనిక విమానాశ్రయంలో టేకాఫ్‌ తీసుకున్నాయి. గ్రీస్‌లో గత కొన్ని రోజులుగా కార్చిచ్చు విస్తరిస్తోంది. ఏథెన్స్‌ వాయవ్య ప్రాంతంలో 100కి పైగా నివాసాలు భస్మీ పటలమయ్యాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement