అమెరికాలో ఘోరం సంభవించింది. ఎయిర్‌షోలో రెండు యుద్ధ విమానాలు ఒకదాన్నొకటి ఢీ కొట్టి పేలిపోయాయి. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఐడాహో స్టేట్ మౌంటెన్ హోమ్ ఎయిర్‌ఫోర్స్ వద్ద ఈ ఘటన జరింది. అయితే అదృష్టవశాత్తూ పైలట్లు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
గన్‌ఫైటర్ స్కైస్ ఎయిర్ షోలో రెండు అమెరికా EA-18G గ్రౌలర్ యుద్ధ విమానాలు మధ్య ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ ఘటన మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఢీకొన్న వెంటనే విమానాలు పేలిపోయి ముక్కలైపోయాయి. ప్రమాద స్థలంలో దట్టమైన నల్ల పొగలు ఎగసిపడగా, అత్యవసర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. బేస్‌ను తక్షణమే లాక్‌డౌన్ చేశారు. ఆదివారం మిగిలిన అన్ని కార్యక్రమాలను రద్దు చేశారు.
విమానాల్లో ఉన్న నాలుగు మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఢీకొన్న క్షణాల్లోనే వారు పారా షూట్ల సహాయంతో కిందికి దిగారు. ఈ విషయాన్ని షో నిర్వాహకులు, అమెరికా నేవీ ధృవీకరించారు.
Footage of the mid air collision between a pair of Navy Super Hornets/Growlers during the Gunfighter Skies Air Show at Mountain Home Air Force Base moments ago. pic.twitter.com/yQqPavmSWk
— OSINTtechnical (@Osinttechnical) May 17, 2026
మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రతినిధి ప్రకారం, ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. "అత్యవసర సిబ్బంది అక్కడే ఉన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అన్నారు.
ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ ఎయిర్ షోకు వేలాది మంది హాజరయ్యారు. అయితే ఈ ప్రమాదం గత ఘటనలను గుర్తు చేసింది. 2018లో ఒక హ్యాంగ్ గ్లైడర్ పైలట్ రన్‌వేపై కూలి మరణించాడు. 2003లో థండర్‌బర్డ్స్ జెట్ కూలిపోయింది. కానీ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. తాజా ప్రమాదం మళ్లీ ఎయిర్ షో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.


