మీడియా ముందుకు త్వరలో హసీనా | Sheikh Hasina to Address Virtual Media Event on August 5 in New Delhi | Sakshi
Sakshi News home page

మీడియా ముందుకు త్వరలో హసీనా

Aug 3 2026 5:22 AM | Updated on Aug 3 2026 12:10 PM

EX Bangladesh PM Sheikh Hasina to appear before the media on August 5

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా ఆగస్టు 5న మీడియా ముందుకు రానున్నారు. న్యూఢిల్లీలో ఆమె ఒక వర్చువల్‌ కార్యక్రమంలో ఆమె ప్రసంగించనున్నారు. తన రాజకీయ భవిష్యత్‌ ప్రణాళిక, ఢాకాకు తిరిగి వెళ్లే ప్రతిపాదన గురించి ఆమె మాట్లాడనున్నారు. రెండేళ్ల కిందట విద్యార్థుల తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోవడంతో పదవీచ్యుతురాలై, భారత్‌లో అజ్ఞాత జీవితం గడుపుతున్న ఆమె తొలిసారిగా బహిరంగంగా కనిపించనున్నారు. న్యూఢిల్లీలోని ఫారిన్‌ కరస్పాండెంట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సౌత్‌ సేషియా (ఎఫ్‌సీసీ సౌత్‌ ఏషియా) ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ఆగస్టు 5న, సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు న్యూఢిల్లీలోని మధుర రోడ్‌లో ఉన్న సర్‌ మార్క్‌ టల్లీ ఆడిటోరియంలో జరుగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement