5న సీజేపీ కీలక భేటీ  | CJP key members to meet on Aug 5 to decide future strategy | Sakshi
Sakshi News home page

5న సీజేపీ కీలక భేటీ 

Aug 3 2026 5:15 AM | Updated on Aug 3 2026 5:15 AM

CJP key members to meet on Aug 5 to decide future strategy

భవిష్యత్‌ కార్యాచరణ ఖరారు

ఛత్రపతి శంభాజీనగర్‌: కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) కీలక సభ్యుల సమావేశం ఈ నెల 5వ తేదీన మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరగనుంది. తదుపరి కార్యాచరణను ఖరారు చేయడమే అజెండాగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే నివాసంలో భేటీ జరగనుందని పార్టీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. వలంటీర్లు, విద్యార్థులతో చర్చలు జరిపి, సూచనలు, సలహాలతో ఈ సమావేశానికి రావాల్సిందిగా ఇప్పటికే కీలక సభ్యులకు సమాచారం అందించామని తెలిపాయి. 5న సమావేశం అనంతరం మీడియాతో భేటీ ఉంటుందని, భవిష్యత్‌ కార్యాచరణను వెల్లడించే అవకాశాలున్నాయని సీజేపీ వర్గాలు వివరించాయి. నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్‌తో సీజేపీ జంతర్‌మంతర్‌లో నిరసనలు కొనసాగించడం తెల్సిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement