దుబాయ్‌లో ఘోరం.. ఏడుగురి భారతీయులు మృతి | Several Indian Workers Death In Mini Bus Truck Collision In Dubai | Sakshi
Sakshi News home page

దుబాయ్‌లో ఘోరం.. ఏడుగురి భారతీయులు మృతి

Jun 9 2026 7:18 AM | Updated on Jun 9 2026 10:34 AM

Several Indian Workers Death In Mini Bus Truck Collision In Dubai

దుబాయ్‌లో ఘోర రోడ్డు ‍ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న మినీ బస్సు ఢీకొట్టింది.  ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు మృతి చెందగా.. 9 మంది గాయపడ్డారు. "దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు భారతీయ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమని దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పేర్కొంది.

ప్రమాదానికి గల కారణాలను దుబాయ్ పోలీసు ట్రాఫిక్ జనరల్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ వివరిస్తూ.. సాంకేతిక లోపం కారణంగా ఎమిరేట్స్ రోడ్డు మధ్యలో ట్రక్కు అకస్మాత్తుగా ఆగిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ప్రమాదానికి గురైన ట్రక్కు, బస్సులను రోడ్డుపై నుండి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం.. సరైన సురక్షిత దూరం పాటించకపోవడం వల్లే వెనుక నుంచి వచ్చి ట్రక్కును బలంగా ఢీకొట్టినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిని భారత రాయబార కార్యాలయ అధికారులు పరామర్శించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement