అమృత్‌సర్‌లోని అత్యంత ప్రముఖ LGBTQ వ్యక్తులలో ఒకరైన పంజాబీ ఇన్‌ఫ్లుయెన్సర్, మేకప్ ఆర్టిస్ట్ మ్యాడ్ సంధును శనివారం బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. తుపాకీ గాయంతో అతను రక్తపు మడుగులో రోడ్డుపై పడి ఉండగా స్థానికులు గుర్తించారు. అతను రోడ్డుపై పడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. శనివారం జరిగిన దాడి తర్వాత ఆసుపత్రికి తరలిస్తుండగా అతను మరణించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కాల్పుల ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిరివెన్నెల తెలిపారు.
బఠిండాలో ఇదే తరహాలో ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ హత్య జరిగిన సరిగ్గా సంవత్సరానికి ఈ ఘటన జరిగింది.సంధు పూర్తి పేరు మధుసూదన్.. మేకప్, సినిమా వ్యాపారంతో పాటు లింగ సమస్యల గురించి మాట్లాడటానికి తరచుగా పాడ్‌కాస్ట్‌లలో అతిథిగా కనిపించేవారు. సోషల్ మీడియాలో నిరంతరం స్వలింగ సంపర్క వ్యతిరేక ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. సంధు సాధారణంగా దేవుడు నన్ను ఇలాగే సృష్టించాడని చెబుతూ ఎప్పుడూ ఎదురుదాడి చేసేవారు. తాను స్వలింగ సంపర్కుడినని దాచలేదు.
సంధు తన వృత్తి జీవితాన్ని పంజాబ్, ముంబైలలో ఫ్యాషన్ పరిశ్రమలో స్టైలిస్ట్‌గా, సినిమాలకు అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ప్రారంభించాడు. అతను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ , వైరల్ వీడియోల ద్వారా విపరీతమైన ప్రజాదరణ పొందాడు. వాటిలో అతను లగ్జరీ లుక్ చిట్కాలు, జీవనశైలికి సంబంధించిన కంటెంట్, సామాజిక కట్టుబాట్లు, LGBTQ+ ఆమోదం, పాప్ కల్చర్‌పై బహిరంగ వ్యాఖ్యానం వంటివి పంచుకున్నాడు. సంధు 'ఓయ్ భోలే ఓయ్' సిరీస్ వంటి కొన్ని పంజాబీ చిత్రాలలో కూడా నటించాడు.


