మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో దారుణమైన ఉదంతం వెలుగు చూసింది. కొందరు ఆకతాయిలు విద్యార్థినులపట్ల అమానుషంగా ప్రవర్తించారు. దీనిపై సదరు అమ్మాయిలు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదుగా చేయగా, బాధ్యతా రాహ్యితంగా అతను వ్యవహరించిన తీరు మరి దిగ్భ్రాంతి రేపింది. ఈ సంఘటన నెట్టింట తీవ్ర విమర్శలకు దారి తీసింది.
తరగతి గది బయట రంగోలి వేస్తున్న 5వ తరగతికి చెందిన 10 మంది విద్యార్థినుల మంచినీటి బాటిళ్లలో కొందరు విద్యార్థులు మూత్రం కలిపారు. అయితే ఈ విషయం తెలియక ఆ నీటిని తాగిన బాలికలు, తరువాత విషయం గ్రహించి ఏడుస్తూ ప్రిన్సిపాల్ మూల్‌చంద్ కౌశిక్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ప్రిన్సిపాల్ బాధ్యతారాహిత్యంగా స్పందిస్తూ, నోరు పాడైతే, రూ.10 చాక్లెట్ తిని సరిపెట్టుకోమనడంతో వివాదం మరింత తీవ్రమైంది.
ఇదీ చదవండి: రూ. 5వేలతో ముంబైకి, పూటగడవని స్థితి..ఇపుడు సూపర్ స్టార్‌డమ్
దీంతో ఆవేదన చెందిన బాలికలు జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో, ఆగ్రహించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాలకు తాలు వేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బాధ్యులైన విద్యార్థులపై, ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అరాన్ SDM మంజుషా ఖాత్రి ఆదేశాల మేరకు తహసీల్దార్ కృష్ణకాంత్ చౌబే, BEO సంతోష్ ధాకడ్ పోలీసు బలగాలతో పాఠశాలకు చేరుకున్నారు. అధికారులు బాధితులు, నిందితులు మరియు కుటుంబ సభ్యుల నుండి స్టేట్‌మెంట్లు సేకరించారు. BEOకి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని SDM ఆదేశించారు. అలాగే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
ఇదీ చదవండి: ఇన్‌స్టామార్ట్‌లో బొద్దింక : ఎఫ్‌డీఏ తుకారాంకు హీరోయిన్ విజ్ఞప్తి


