breaking news
prinipal
-
నేపాల్ వరదలు : 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు !
Nepal flash Floods నేపాల్ వరద బీభత్సం పెను విషాదాన్ని మిగిల్చింది. వందలాదిమందిని పొట్టన బెట్టుకుంది. అయితే ఇంతటి భారీ విపత్తులో అక్కడక్కడా వెలుగు చూస్తున్న కొన్ని ఘటనలు నెట్టింట ప్రశంసలందుకుంటున్నాయి. ముఖ్యంగా ఒక ఉపాధ్యాయుడు రానున్న విపత్తును ఊహించి, త్వరితగతిన స్పందించి, వందలమంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించి వారి ప్రాణాలను కాపాడిన ఘటన భారీ ఊరటనిస్తోంది. బుధవారం ఉదయం 9:20 గంటలకు, నేపాల్‌లోని నువాకోట్‌కు చెందిన త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడీ (47), ఆకస్మికంగా వచ్చిన భయంకరమైన వరదల నుంచి తన సమయస్ఫూర్తితో 1,643 మంది విద్యార్థులను సురక్షితంగా కాపాడారు.గ్రామం వరదల్లో కొట్టుకుపోయిందని స్నేహితుడి నుంచి ఫోన్ రావడంతో పాటు, ఒక విద్యార్థి తండ్రి వరద నీరు వేగంగా పెరుగుతోందని హెచ్చరించాడు. దీనితో వెంటనే అప్రమత్తమైన ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు , ప్రిన్సిపాల్ కూడా అయిన దవాడీ, పాఠశాల గంట మోగించి తరగతి గదులను ఖాళీ చేయాల్సిందిగా ఉపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాల భవనాలు వరద నీటిలో కొట్టుకుపోకముందే, దవాడీ 1,643 మంది పిల్లలను కాలినడకన కొండపై ఉన్న ఒక రావి చెట్టు (Bodhi tree) కిందకు సురక్షితంగా తీసుకెళ్లారు.విషాదం అయితే విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడినప్పటికీ, ఇద్దరు పాఠశాల సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం అంతులేని విచారాన్ని మిగిల్చింది. సంతోష్ పరియార్ (32), సోషల్ హిస్టరీ టీచర్, నది ఒడ్డున ఉన్న తన గదికి తిరిగి వెళ్లిన సమయంలో వరదలో కొట్టుకుపోయారు. అలాగే పాఠశాల తలుపులు మూసివేయడానికి వెనుకకు వెళ్లిన పాఠశాల జానిటర్ సుల్తాన్ లామా కూడా వరదలో ప్రాణాలు కోల్పోయారు.కాగా లాంగ్టాంగ్ లిరుంగ్ శిఖరం నుండి దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భారీ మంచు మరియు రాళ్ల ఉపరితలం 1,200 మీటర్ల ఎత్తు నుండి లెండే ఖోలా నదిలో పడిపోయింది. దీనివల్ల ఏర్పడిన ఆకస్మిక వరదలు భవనాలు, వంతెనలు, విద్యుత్ కేంద్రాలను తుడిచిపెట్టేశాయి. ఈ ప్రమాదంలో నేపాల్‌లో 734 మంది మరణించగా, దాదాపు 2,500 మంది గల్లంతయ్యారు. టిబెట్‌లోనూ భారీ నష్టం వాటిల్లింది. -
బాలికల వాటర్ బాటిళ్లలో మూత్రం కలిపి ఆకతాయిలు, చాక్లెట్ తినమన్న ప్రిన్సిపాల్
మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో దారుణమైన ఉదంతం వెలుగు చూసింది. కొందరు ఆకతాయిలు విద్యార్థినులపట్ల అమానుషంగా ప్రవర్తించారు. దీనిపై సదరు అమ్మాయిలు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదుగా చేయగా, బాధ్యతా రాహ్యితంగా అతను వ్యవహరించిన తీరు మరి దిగ్భ్రాంతి రేపింది. ఈ సంఘటన నెట్టింట తీవ్ర విమర్శలకు దారి తీసింది.తరగతి గది బయట రంగోలి వేస్తున్న 5వ తరగతికి చెందిన 10 మంది విద్యార్థినుల మంచినీటి బాటిళ్లలో కొందరు విద్యార్థులు మూత్రం కలిపారు. అయితే ఈ విషయం తెలియక ఆ నీటిని తాగిన బాలికలు, తరువాత విషయం గ్రహించి ఏడుస్తూ ప్రిన్సిపాల్ మూల్‌చంద్ కౌశిక్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ప్రిన్సిపాల్ బాధ్యతారాహిత్యంగా స్పందిస్తూ, నోరు పాడైతే, రూ.10 చాక్లెట్ తిని సరిపెట్టుకోమనడంతో వివాదం మరింత తీవ్రమైంది.ఇదీ చదవండి: రూ. 5వేలతో ముంబైకి, పూటగడవని స్థితి..ఇపుడు సూపర్ స్టార్డమ్దీంతో ఆవేదన చెందిన బాలికలు జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో, ఆగ్రహించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాలకు తాలు వేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బాధ్యులైన విద్యార్థులపై, ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అరాన్ SDM మంజుషా ఖాత్రి ఆదేశాల మేరకు తహసీల్దార్ కృష్ణకాంత్ చౌబే, BEO సంతోష్ ధాకడ్ పోలీసు బలగాలతో పాఠశాలకు చేరుకున్నారు. అధికారులు బాధితులు, నిందితులు మరియు కుటుంబ సభ్యుల నుండి స్టేట్మెంట్లు సేకరించారు. BEOకి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని SDM ఆదేశించారు. అలాగే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇదీ చదవండి: ఇన్‌స్టామార్ట్‌లో బొద్దింక : ఎఫ్‌డీఏ తుకారాంకు హీరోయిన్ విజ్ఞప్తి -
తీవ్ర పదజాలంతో పేరెంట్‌పై ప్రిన్సిపాల్ వీరంగం!? వీడియో వైరల్
యూపీలో ఒక పాఠశాల ప్రిన్సిపాల్ అనుచిత వైఖరి సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వీడియోను @NewsAlgebraINDతో సహా ట్విటర్లో పలువురు యూజర్లు ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్‌గా మారిన వీడియో ప్రకారం షట్ అప్, షట్ అప్ గెట్లాస్ట్ అంటూ ఒక విద్యార్థి తల్లిపై సన్‌బీమ్ పాఠశాల ప్రిన్సిపాల్ మమతా మిశ్రా విచక్షణా రహితంగా విరుచుకుపడింది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి.పాఠశాల పుస్తకాల కొనుగోలు నిబంధనలను పాటించనందుకు, వారి పిల్లల పేరును తొలగించమని ప్రిన్సిపాల్ తల్లిదండ్రులను కోరినట్లు వార్తలు రావడంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది.బయటి విక్రేతల నుండి పుస్తకాలు కొనడంపై పాఠశాల విధానాన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులపై "నోరు మూయండి! ఇక్కడి నుండి వెళ్ళిపోండి!" అని అరుస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డ్ కావడంతో హర్దోయ్‌లో పెద్ద వివాదం చెలరేగింది. తల్లిదండ్రులు, సామాన్య ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. పాఠశాల యాజమాన్యాల వైఖరి, సిబ్బంది ప్రవర్తన, జవాబుదారీతనంపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.School Principal lost her cool at mother for not purchasing books from the school.PRINCIPAL : "You shut up! Get lost. I am going to remove the children's name from the Register" 🤯pic.twitter.com/OWt5cvk5hZ— News Algebra (@NewsAlgebraIND) April 26, 2026దీనిపై వివాదం మరింత ముదరడంతో ప్రిన్సిపాల్ మమతా మిశ్రా ఆ రోజు ఏం జరిగిందో, తాను తల్లిదండ్రులపై ఎందుకు అరిచానో వివరిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.Sunbeam School Hardoi Principal Mamta Mishra’s clarification: Parents were pressuring to reduce ₹1300 monthly fee, so she lost her cool. Questions how much lower it should go. (2/3) pic.twitter.com/osbgnXuAOS— Ghar Ke Kalesh (@gharkekalesh) April 26, 2026 హర్దోయ్‌లోని సన్‌బీమ్ స్కూల్ ప్రిన్సిపాల్ మమతా మిశ్రా తన వివరణలో పేర్కొన్న దాని ప్రకారం నెలకు రూ.1,300 ఫీజును తగ్గించాలని తల్లిదండ్రులు తనపై ఒత్తిడి తీసుకురావడంతో సహనం కోల్పోయింది. ఫీజును ఇంకా ఎంత తగ్గించాలని ఆశిస్తున్నారని ప్రశ్నించింది. సంఘటన జరిగిన రోజున, పాఠశాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో టీకా కార్యక్రమం జరుగుతోందని, ఈ విషయాన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా తల్లిదండ్రులకు అప్పటికే తెలియజేశామనిన్నారు. సాధారణంగా, టీకాల సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో పాటు ఉంటారు, కానీ ఇది పాఠశాల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కావడంతో, పిల్లలను చూసుకోవడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు.సరిగ్గా ఆసమయంలో తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా అదే రోజు తమ ఆందోళనలను వ్యక్తం చేసి, ప్రక్రియకు అంతరాయం కలిగించారనేది ఆమె అయితే. అంతేకాదు తమ పాఠశాల ఎల్లప్పుడూ నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తూ, ఏళ్లుగా వారి సంక్షేమం కోసం కృషి చేస్తోందని ఆమె తెలిపారు. చాలా మంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని పేర్కొన్నారు.వైరల్ వీడియోలో సంఘటనలోని కొంత భాగాన్ని మాత్రమే చూపించారని, పూర్తి సందర్భం అందులో లేదని ఆమె అన్నారు. ఒక చిన్న క్లిప్ ఆధారంగా తన వ్యక్తిత్వాన్ని అంచనా వేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: సహజీవనం, బిడ్డ : ఇపుడు లైంగిక దాడి అంటే ఎలా? సుప్రీం కీలక వ్యాఖ్యలు Sunbeam School Hardoi Principal Mamta Mishra harshly scolded mother Neelam Verma just for requesting a 15-day fee extension.⁰Neelam has now accused the principal of extreme misbehavior. pic.twitter.com/zOJX3DlTr2— Ghar Ke Kalesh (@gharkekalesh) April 26, 2026బాధిత మహిళ వాదనతల్లి నీలం వర్మ ప్రకారం, కేవలం 15 రోజుల గడువు పొడిగింపు కోరినందుకే తనపై దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. అప్పటికే నోట్‌బుక్‌లతో సహా పూర్తి కోర్సును కొనుగోలు చేశాను, కానీ భర్త ప్రస్తుతం ఊళ్లోలేని కారణంగా 15 రోజుల సమయం కోరానని, అయినా కనీస మర్యాద లేకుండా, దుర్బాషలాడుతూ పిల్లల వస్తువులను రోడ్డుపై విసిరేశారని వాపోయింది.ఇదీ చదవండి : రూ. లక్షకు కొని, ‘లక్’ లేదని వదిలేశారు.. షాకింగ్ ఫ్యాక్ట్స్ -
మందలించినందుకు ప్రిన్సిపాల్‌నే చంపేశాడు
యమునానగర్: స్నేహితుల ముందు మందలించిందన్న కోపంతో 12వ తరగతి విద్యార్థి మహిళా ప్రిన్సిపాల్‌ను తుపాకీతో కాల్చి హత్య చేశాడు. హరియాణాలోని యమునానగర్‌లో స్వామి వివేకానంద పాఠశాలలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల ఆ విద్యార్థి అదే పాఠశాలలో కామర్స్ కోర్సు చదువుతున్నట్లు తెలిసింది. తండ్రి తుపాకీని దొంగిలించి ఈ ఘోరానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని హత్యా నేరం కింద కేసు నమోదుచేశారు. యమునానగర్ ఎస్పీ రాజేశ్ కాలియా వెల్లడించిన వివరాల ప్రకారం...ప్రిన్సిపాల్‌తో కొద్దిసేపు మాట్లాడి బయటకు వచ్చిన తరువాత విద్యార్థి మళ్లీ లోనికి వెళ్లి ఆమెపై కాల్పులు జరిపాడు. ఛాతీ, పొట్ట, భుజంపై నాలుగు బుల్లెట్లు దిగడంతో తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపాల్ రీతు చాబ్రా(47)ను వెంటనే ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఆమెను కాల్చిన తరువాత విద్యార్థి పారిపోవడానికి ప్రయత్నించినా అక్కడే ఉన్న కొందరు తల్లిదండ్రులు, స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించారు. ఉపాధ్యాయులు ఫిర్యాదు చేయడంతో స్నేహితుల ముందే ప్రిన్సిపాల్ తనను గతంలో రెండుసార్లు మందలించడం బాధించిందని అతడు పోలీసులకు చెప్పాడు. దాన్ని మనసులో ఉంచుకుని ఆమెపై కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో అల్మారా బద్దలుకొట్టి తన తండ్రి తుపాకీని దొంగిలించి ఆమెపై కాల్పులు జరిపాడు. విచారణలో విద్యార్థి తన నేరాన్ని అంగీకరించాడు. -
ప్రినిపాల్ సస్పెన్షన్
కామారెడ్డి: మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ బషీరొద్దీన్ హైమద్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ సెక్రెటరీ శేషుకుమారి ఆదేశాలు జారీ చేశారు. అద్దె భవనంలో కొనసాగుతున్న పాఠశాలను సొంత భవనంలోకి మార్చాలని పలుమార్లు సూచించినప్పటికీ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విద్యార్థులను చితకబాదాడని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ పనితీరుపై చేసిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి వేటు వేశారు. వనపర్తి రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ జానీమియాకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.


