యూపీలో ఒక పాఠశాల ప్రిన్సిపాల్ అనుచిత వైఖరి సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వీడియోను @NewsAlgebraINDతో సహా ట్విటర్‌లో పలువురు యూజర్లు ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్‌గా మారిన వీడియో ప్రకారం షట్ అప్, షట్ అప్ గెట్‌లాస్ట్ అంటూ ఒక విద్యార్థి తల్లిపై సన్‌బీమ్ పాఠశాల ప్రిన్సిపాల్ మమతా మిశ్రా విచక్షణా రహితంగా విరుచుకుపడింది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి.పాఠశాల పుస్తకాల కొనుగోలు నిబంధనలను పాటించనందుకు, వారి పిల్లల పేరును తొలగించమని ప్రిన్సిపాల్ తల్లిదండ్రులను కోరినట్లు వార్తలు రావడంతో ఈ వివాదం మరింత తీవ్రమైంది.
బయటి విక్రేతల నుండి పుస్తకాలు కొనడంపై పాఠశాల విధానాన్ని ప్రశ్నించిన తల్లిదండ్రులపై "నోరు మూయండి! ఇక్కడి నుండి వెళ్ళిపోండి!" అని అరుస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డ్ కావడంతో హర్దోయ్‌లో పెద్ద వివాదం చెలరేగింది. తల్లిదండ్రులు, సామాన్య ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. పాఠశాల యాజమాన్యాల వైఖరి, సిబ్బంది ప్రవర్తన, జవాబుదారీతనంపై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది.
School Principal lost her cool at mother for not purchasing books from the school.
PRINCIPAL : "You shut up! Get lost. I am going to remove the children's name from the Register" 🤯
pic.twitter.com/OWt5cvk5hZ— News Algebra (@NewsAlgebraIND) April 26, 2026
దీనిపై వివాదం మరింత ముదరడంతో ప్రిన్సిపాల్ మమతా మిశ్రా ఆ రోజు ఏం జరిగిందో, తాను తల్లిదండ్రులపై ఎందుకు అరిచానో వివరిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.
Sunbeam School Hardoi Principal Mamta Mishra’s clarification: Parents were pressuring to reduce ₹1300 monthly fee, so she lost her cool. Questions how much lower it should go. (2/3) pic.twitter.com/osbgnXuAOS
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 26, 2026
హర్దోయ్‌లోని సన్‌బీమ్ స్కూల్ ప్రిన్సిపాల్ మమతా మిశ్రా తన వివరణలో పేర్కొన్న దాని ప్రకారం నెలకు రూ.1,300 ఫీజును తగ్గించాలని తల్లిదండ్రులు తనపై ఒత్తిడి తీసుకురావడంతో సహనం కోల్పోయింది. ఫీజును ఇంకా ఎంత తగ్గించాలని ఆశిస్తున్నారని ప్రశ్నించింది. సంఘటన జరిగిన రోజున, పాఠశాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో టీకా కార్యక్రమం జరుగుతోందని, ఈ విషయాన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా తల్లిదండ్రులకు అప్పటికే తెలియజేశామనిన్నారు. సాధారణంగా, టీకాల సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో పాటు ఉంటారు, కానీ ఇది పాఠశాల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కావడంతో, పిల్లలను చూసుకోవడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
సరిగ్గా ఆసమయంలో తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా అదే రోజు తమ ఆందోళనలను వ్యక్తం చేసి, ప్రక్రియకు అంతరాయం కలిగించారనేది ఆమె అయితే. అంతేకాదు తమ పాఠశాల ఎల్లప్పుడూ నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తూ, ఏళ్లుగా వారి సంక్షేమం కోసం కృషి చేస్తోందని ఆమె తెలిపారు. చాలా మంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని పేర్కొన్నారు.వైరల్ వీడియోలో సంఘటనలోని కొంత భాగాన్ని మాత్రమే చూపించారని, పూర్తి సందర్భం అందులో లేదని ఆమె అన్నారు. ఒక చిన్న క్లిప్ ఆధారంగా తన వ్యక్తిత్వాన్ని అంచనా వేయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: సహజీవనం, బిడ్డ : ఇపుడు లైంగిక దాడి అంటే ఎలా? సుప్రీం కీలక వ్యాఖ్యలు
Sunbeam School Hardoi Principal Mamta Mishra harshly scolded mother Neelam Verma just for requesting a 15-day fee extension.
⁰Neelam has now accused the principal of extreme misbehavior. pic.twitter.com/zOJX3DlTr2— Ghar Ke Kalesh (@gharkekalesh) April 26, 2026
బాధిత మహిళ వాదన
తల్లి నీలం వర్మ ప్రకారం, కేవలం 15 రోజుల గడువు పొడిగింపు కోరినందుకే తనపై దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. అప్పటికే నోట్‌బుక్‌లతో సహా పూర్తి కోర్సును కొనుగోలు చేశాను, కానీ భర్త ప్రస్తుతం ఊళ్లోలేని కారణంగా 15 రోజుల సమయం కోరానని, అయినా కనీస మర్యాద లేకుండా, దుర్బాషలాడుతూ పిల్లల వస్తువులను రోడ్డుపై విసిరేశారని వాపోయింది.
ఇదీ చదవండి : రూ. లక్షకు కొని, ‘లక్’ లేదని వదిలేశారు.. షాకింగ్ ఫ్యాక్ట్స్


