ఏపీలో ఇంధన సంక్షోభం మరింత ముదిరింది. డీజీల్, పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉన్న 4,510 బంకుల్లో 70 శాతానికిపైగా మూతబడ్డాయి. కొన్నిచోట్ల ఉన్న కొద్ది స్టాక్‌ను రేషన్ లెక్కన అందిస్తున్నారు.
అందుకోసం కనుచూపుమేర వాహనాలు బారులుతీరాయి. గంటల తరబడి ఎదురు చూపుల తర్వాత అరకొర ఇంధనంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


