భోపాల్: మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని, భోపాల్ దిగ్భ్రాంతికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఆడబిడ్డ ఇంటికి లక్ష్మిలాంటిది అని భావిస్తారు. కానీ తమ కుటుంబానికి, వ్యాపారానికి రెండున్నరేళ్ల పాపను ఇంటికి పట్టిన శనిగా భావించారు. ఎలాగైనా వదిలించుకోవాలని భావించారు. ఏప్రిల్ 18న నేషనల్ హైవేపై వదిలేశారు. కట్ చేస్తే..దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
షియోపూర్ జిల్లాలోని ఒక హైవేపై తమ రెండున్నరేళ్ల కుమార్తెను వదిలేశారు ఒక వ్యాపారవేత్త కుటుంబం. పోలీసులు ఆమెను రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. అయితే వీరి విచారణలో సంచలన విషయాలు వెలుగు చేశాయి. ఏప్రిల్ 18న షియోపూర్‌లోని సోయిన్‌కలాన్‌లో జాతీయ రహదారి-552పై ఆ పాప ఒంటరిగా కనిపించింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానిక బాలల సంక్షేమ కమిటీ (CWC)కి సమాచారం అందించారు. వైద్య పరీక్షల అనంతరం ఆ కమిటీ బాలికను తమ సంరక్షణలోకి తీసుకుంది.
అయితే ఈకేసు విచారణలో అనుమానిత బాలల అక్రమ రవాణా ముఠా వ్యవహారం తెలిసింది. ఆ పాపను వారు దత్తత తీసుకోలేదు, రూ.లక్షకు ఇండోర్‌లోని ఒక అక్రమ నెట్‌వర్క్ ద్వారా కొనుగోలుచేశారని పోలీసులు చెబుతున్నారు. ఈ ముఠా బలహీన వర్గాల నుంచి పిల్లలను సేకరించి, దత్తత ముసుగులో కొనుగోలు దారులకు అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు.
इस छोटी सी बच्ची को उसके मां-बाप ने श्योपुर के पास एक ढाबे में छोड़ दिया, बच्ची को उन्होंने गोद लिया था फिर कहा कारोबार में नुकसान हुआ तो बच्ची को मनहूस समझने लगे ... अब पता लगा है कि ये सब मानव तस्करी से जुड़े थे इस शख्स ने बच्ची की सूचना पुलिस को दी pic.twitter.com/2cX0TRW6zg
— Anurag Dwary (@Anurag_Dwary) April 27, 2026
సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో పోలీసులు, చిన్నారిని పడేయడానికి ఉపయోగించిన వాహనాన్ని భోపాల్‌లో గుర్తించారు. తద్వారా గుణకు చెందిన ఒక వ్యాపారవేత్త దంపతులను అరెస్ట్ చేశారు. ఆ చిన్నారిని చట్టబద్ధంగా దత్తత తీసుకున్నామని వాదింయినప్పటికీ పోలీసుల సుదీర్ఘ విచారణలో అసలు విషయం ఒప్పుకుని, ఆ బాలికను ఇండోర్‌కు చెందిన ఒక బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు, ఆమె సహచరుల నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.అయితే ఆ పాప ఇంట్లోకి వచ్చినప్పటి నుండి తమకు అరిష్టం జరుగుతోందని, అందుకే ఆమెను నిర్మానుష్య ప్రాంతంలో వదిలేశామని వారు ఒప్పుకున్నారు.
మరోవైపు ఈ కేసులో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, భోపాల్‌కు చెందిన ఒక మహిళ, తాను ఆ చిన్నారి మాజీ సంరక్షకురాలినని చెప్పుకుంటూ, ఆ బాలిక శారీరక వేధింపులకు గురైందని పోలీసులకు తెలిపింది. బిడ్డను చూసుకోవడానికి తనను నెలకు రూ. 20,000 జీతానికి నియమించుకున్నారని, అయితే జీతం అందకపోవడంతో తాను పని మానేశానని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఈ కేసులో హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా) మరియు జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ ముఠాలో ఉన్న ఇండోర్‌కు చెందిన బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు సహా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ చిన్నారి కన్న తల్లిదండ్రులను గుర్తించి, ఈ దందా పూర్తి స్థాయిని వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చదవండి: సహజీవనం, బిడ్డ : ఇపుడు లైంగిక దాడి అంటే ఎలా? సుప్రీం కీలక వ్యాఖ్యలు


