మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ బషీరొద్దీన్ హైమద్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ సెక్రెటరీ శేషుకుమారి ఆదేశాలు జారీ చేశారు.
ప్రినిపాల్ సస్పెన్షన్
Jul 24 2016 9:10 PM | Updated on Oct 17 2018 6:06 PM
కామారెడ్డి: మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ బషీరొద్దీన్ హైమద్‌పై సస్పెన్షన్ వేటు వేస్తూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ సెక్రెటరీ శేషుకుమారి ఆదేశాలు జారీ చేశారు. అద్దె భవనంలో కొనసాగుతున్న పాఠశాలను సొంత భవనంలోకి మార్చాలని పలుమార్లు సూచించినప్పటికీ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విద్యార్థులను చితకబాదాడని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ పనితీరుపై చేసిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి వేటు వేశారు. వనపర్తి రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ జానీమియాకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
Advertisement


