ఫూటుగా తాగి ఇంగ్లండ్‌ ప్లేయర్ల వీరంగం.. జట్టు నుంచి నిషేధం! | ECB Serious Ben Stokes Captaincy Under Threat After Night Club Incident | Sakshi
Sakshi News home page

Ben Stokes: ఫూటుగా తాగి ఇంగ్లండ్‌ ప్లేయర్ల వీరంగం.. జట్టు నుంచి నిషేధం!

Jun 9 2026 8:11 AM | Updated on Jun 9 2026 11:34 AM

ECB Serious Ben Stokes Captaincy Under Threat After Night Club Incident

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వివాదంలో చిక్కుకున్నాడు. జ‌ట్టు బౌల‌ర్ గ‌స్ అట్కిన్స‌న్‌తో క‌లిసి ఫూటుగా మ‌ద్యం తాగి అప‌రిచితుల‌పై దాడి చేసి వీరంగం సృష్టించాడు. తాజా ఉదంతంతో స్టోక్స్ మెడ‌కు ఉచ్చు బిగుసుకున్న‌ట్లుగా అనిపిస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై సీరియ‌స్ అయిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్టోక్స్‌తో పాటు అట్కిన్స‌న్‌పై నిషేధం విధించే అవ‌కాశం లేక‌పోలేదు. 

ఈ ఘ‌ట‌న‌తో స్టోక్స్ టెస్టు కెప్టెన్సీకి కూడా ముప్పు పొంచి ఉంది. విష‌యంలోకి వెళితే.. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ మ‌ధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 115 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. రెండో టెస్టు బుధ‌వారం నుంచి జ‌ర‌గ‌నుంది. మొద‌టి టెస్టు గెలిచిన ఆనందంలో కెప్టెన్ బెన్‌స్టోక్స్‌, బౌల‌ర్ అట్కిన్స‌న్‌లు బోర్డు అనుమ‌తి లేకుండా దొంగ‌చాటుగా ఒక నైట్‌క్లబ్‌కు వెళ్లారు. 

ఇద్ద‌రు పీకలదాకా మ‌ద్యం తాగారు. అనంతరం హోటల్ రూమ్ కు వస్తుండగా కొంతమంది అపరిచితులతో గొడవపడ్డారు . మాటా మాట పెర‌గ‌డంతో ఇరు వ‌ర్గాలు ఒక‌రిపై ఒక‌రు బీర్‌ బాటిల్స్ విసురుకున్నారు. అట్కిన్‌స‌న్ వద్ద‌ని వారించినా స్టోక్స్ విన‌కుండా అవ‌త‌లి వ‌ర్గంలో ఉన్న వ్య‌క్తుల్లో ఒక‌రిని కింద‌ప‌డేసి విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టాడు. అయితే ఈ సంఘటనలో బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు కూడా నమోదు చేసిన‌ట్లు తెలుస్తోంది. విష‌యం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు తెలియ‌డంతో ఆగ్ర‌హించింది. ఆట‌గాళ్లు బోర్డు అనుమ‌తి లేకుండా బ‌య‌టికి వెళ్ల‌డ‌మే త‌ప్ప‌ని, అలాంటిది నైట్‌క్ల‌బ్‌కు వెళ్లి పీక‌ల‌దాకా మ‌ద్యం తాగి అప‌రిచితుల‌పై దాడి చేయ‌డం క‌రెక్టు కాద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌పై విచారణ కమిటీ వేసిన‌ట్లు బోర్డు తెలిపింది. 

ఈ వ్య‌వ‌హారంలో బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సల తప్పు ఉంద‌ని తేలితే మాత్రం ఇద్ద‌రిపై నిషేధం ప‌డే అవ‌కాశ‌ముంది. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంలో ఇద్ద‌రిని వేర్వేరుగా విచారించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో కివీస్‌తో రెండో టెస్టులో వీరిద్ద‌రూ ఆడేది అనుమాన‌మే. అంతేకాదు బెన్ స్టోక్స్‌ను కెప్టెన్సీ నుంచి తొల‌గించే అంశంపై కూడా ఒక నిర్ణ‌యానికి రానున్న‌ట్లు బోర్డు తెలిపింది. 

అయితే ఇంగ్లండ్‌ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాగే పీకల దాకా తాగి రచ్చ చేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే గ‌తేడాది న‌వంబ‌ర్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కూడా ఇలాగే నైట్‌క్ల‌బ్ వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్‌తో వ‌న్డే మ్యాచ్‌కు ముందు వెల్లింగ్‌ట‌న్‌లో ఒక నైట్‌క్ల‌బ్‌కు వెళ్లిన బ్రూక్ బౌన్స‌ర్‌తో వాగ్వాదానికి దిగాడు. 

ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న జాక‌బ్ బెథెల్ కూడా బ్రూక్‌తో క‌లిసి బౌన్స‌ర్‌పై గొడ‌వ‌కు దిగాడు. అయితే దాడి పెద్ద‌ది కాక‌పోవ‌డంతో ఈసీబీ వీరిద్ద‌రిని మంద‌లింపు చ‌ర్య‌తో స‌రిపెట్టింది. కానీ స్టోక్స్, అట్కిన్సన్ విష‌యంలో మాత్రం బోర్డు గుర్రుగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఒకవేళ స్టోక్స్‌పై నిషేధం పడితే అతడి స్థానంలో హ్యారీబ్రూక్‌ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నాడు.

చదవండి: టీ20 ముంబై లీగ్‌లో అర్జున్ టెండూల్క‌ర్ విధ్వంసం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement