లండన్: యూకేలోని వేల్స్‌లో మారుమూల ప్రాంతంలో చిన్న విమానం కుప్పకూలిన ఘటనలో అందులో ఉన్న భారత సంతతికి చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు. గత శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. తమ ప్రఖ్యాత సభ్యుడు, అతని భార్య విమాన ప్రమాదంలో మరణించడం చాలా విచారకరం అంటూ ఒక ఫ్లయింగ్ క్లబ్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది.
గ్వినెడ్‌లోని ట్రాస్వినిడ్ సమీపంలోని ఒక మారుమూల ప్రదేశంలో వారు ప్రయాణిస్తున్న తేలికపాటి విమానాన్ని గుర్తించడంతో, లీసెస్టర్‌షైర్‌లోని సిస్టన్‌కు చెందిన కేతన్ స్వాలి, శీతల్ స్వాలి అక్కడికక్కడే మరణించినట్లు ప్రకటించారు. ఈ జంట బర్టన్-అపాన్-ట్రెంట్‌లోని టేటెన్‌హిల్ విమానాశ్రయం నుండి షేర్‌వుడ్ ఫ్లయింగ్ క్లబ్ నుండి అద్దెకు తీసుకున్న పైపర్ PA28 విమానంలో ప్రయాణిస్తున్నారని ప్రాథమిక విచారలో తేలింది.
ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’
పైపర్ 2ఏ రకానికి చెందిన ఈ విమానాన్ని కేతన్ స్వాలి నడుపుతుండగా, ఆయనతోపాటు భార్య శీతల్ ప్రయాణిస్తున్నారు. వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలోని టటెన్‌హిల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న వీరి విమానం స్నోడోనియాలోని కేర్నర్ఫాన్ విమానాశ్రయంలో ల్యాండవ్వాల్సి ఉంది. అయితే, విమానం జాడ తెలియకుండా పోయింది. అన్వేషణ చేపట్టిన అధికారులు విమాన శకలాలను, మృతదేహాలను నార్త్ వేల్స్‌లోని ట్రాస్‌ఫినిడ్ వద్ద కనుగొన్నారు. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. లీసెస్టర్‌కు చెందిన ఆర్క్ యూరో టేరడ్ లిమిటెడ్ అనే ఇంజినీరింగ్ కంపెనీకి కేతన్ స్వాలి డైరెక్టర్‌గా ఉన్నారు.
ఇదీ చదవండి: రూ. 5వేలతో ముంబైకి, పూటగడవని స్థితి..ఇపుడు సూపర్ స్టార్‌డమ్


