జైలు గోడల వెనుక ఉన్న నేత.. రోడ్డెక్కిన వేలాది మంది మద్దతుదారులను అడ్డుకునేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. దీంతో దాయాది దేశం పాకిస్తాన్‌లో మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు భగ్గుమంటున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు అనుమతించడంతో పాటు, ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వ్యక్తిగత వైద్యులతో చికిత్స చేయించాలని పీటీఐ పట్టుబట్టగా.. ముందుగా అక్టోబర్ 4న చేపట్టనున్న నిరసనను విరమించుకోవాలని ప్రభుత్వం షరతు పెట్టింది. రెండు విడతల చర్చలు జరిగినా ప్రతిష్టంభన వీడకపోవడంతో పీటీఐ ఇస్లామాబాద్ మార్చ్‌కు సిద్ధమైంది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(73).. 2023 నుంచి రావల్పిండి అడియాలా జైలులో ఉన్నారు. ఆయనపై 100కుపైగా కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. వెంటనే ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతించాలని, ఆయన వ్యక్తిగత వైద్యులు పరీక్షించి చికిత్స అందించేలా ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని పీటీఐ డిమాండ్ చేస్తోంది. ఇమ్రాన్ సోదరీమణులు, ముందస్తుగా అరెస్టైన పార్టీ కార్యకర్తలను విడుదల చేయాలని, ఆయన భార్య బుష్రా బీబీకి వైద్య పరీక్షలు నిర్వహించాలని కూడా కోరుతున్నారు.
🚨🇵🇰: Today, October 4, marks the first day of Pakistan (#PTI) protests. People from different provinces across #Pakistan have started traveling toward Islamabad. Visuals from Waziristan, thousands are marching towards #Islamabad 🚨 https://t.co/y44lwzslci
— World_Breaking_News03 (@Breaking2003) October 4, 2026
వైద్య పరీక్షలు చేయాల్సిందే..
ఇమ్రాన్‌ను ఆస్పత్రికి తరలించే అంశంపై ఇప్పటికే న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది. ఆగస్టు 18న పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇమ్రాన్‌ను ఇస్లామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు, చికిత్స అందించాలని ఆదేశించింది. అయితే ఆగస్టు 20-21 రాత్రి అడియాలా జైలు నుంచి తరలించిన ఇమ్రాన్‌ను షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS)కు తీసుకెళ్లారు. భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్పింది. అక్కడ పరీక్షల అనంతరం ఆయనను తిరిగి జైలుకు తరలించారు. తన వ్యక్తిగత వైద్యుడిని మాత్రం పరీక్షల్లో పాల్గొననివ్వలేదు.
ఈ అంశంపైనే పీటీఐ, ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం ముదిరింది. శుక్రవారం, శనివారం రెండు విడతలుగా జరిగిన చర్చల్లోనూ ఇరుపక్షాలు తమ డిమాండ్లపై వెనక్కి తగ్గలేదు. ఇమ్రాన్‌ను కలిసేందుకు ముందుగా అనుమతి ఇవ్వాలని పీటీఐ కోరగా.. నిరసన విరమిస్తేనే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇస్లామాబాద్ వైపు పీటీఐ మార్చ్
చర్చలు విఫలమైన నేపథ్యంలో ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ముఖ్యమంత్రి సొహైల్ అఫ్రిది అర్ధరాత్రి నిరసన కొనసాగుతుందని ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం లక్కీ మార్వత్‌లోని గండి చౌక్ నుంచి మార్చ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ట్యాంక్, డేరా ఇస్మాయిల్ ఖాన్, సౌత్-నార్త్ వజీరిస్థాన్, బన్నూ, లక్కీ మార్వత్ ప్రాంతాల నుంచి కార్యకర్తలు ఇందులో పాల్గొననున్నారు. ఈ కాన్వాయ్ కరాక్, కోహట్, పెషావర్, చార్సద్దా మీదుగా ముందుకు సాగనుంది. అక్టోబర్ 8న ఖైబరాబాద్ వద్ద ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా కార్యకర్తలు చేరనున్నట్లు పీటీఐ ప్రకటించింది. అనంతరం ఇస్లామాబాద్ వైపు కదిలే అవకాశం ఉంది.
🚨🇵🇰Breaking: Today, October 4, marks the first day of Pakistan (#PTI ) protests. People from different provinces across #Pakistan have started traveling toward Islamabad. Thousands are marching towards #Islamabad 🚨 https://t.co/ZVkLp7ci4L
— World_Breaking_News03 (@Breaking2003) October 4, 2026
రాజధానిలో భారీ భద్రత
మరోవైపు పీటీఐ మార్చ్‌ను ఇస్లామాబాద్‌లోకి అనుమతించబోమని ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ రాజకీయ సలహాదారు రానా సనావుల్లా స్పష్టం చేశారు. రాజధానికి వెళ్లే ప్రధాన రహదారులపై అదనపు భద్రతా బలగాలను మోహరించడంతో పాటు.. రోడ్లపై షిప్పింగ్ కంటైనర్లను ఏర్పాటు చేస్తున్నారు. చర్చలు విఫలం కావడం, పీటీఐ మార్చ్‌కు సిద్ధం కావడం, ఇమ్రాన్ ఖాన్ వైద్య చికిత్సపై వివాదం కొనసాగుతుండటంతో పాకిస్తాన్‌లో మరోసారి పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది.
ఇదీ చదవండి: ఇరాన్‌కు ట్రంప్ స్వీట్ వార్నింగ్..


