సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ శుక్రవారం నాడు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) కార్యాలయంలో ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులను కలిశారు. ఈ సం దర్భంగా పోలీస్ స్టేషన్ వెలుపల ధర్నా (సీట్-ఇన్) నిరసన తెలిపారు. నిరసనకారులపై దాడులు చేసిన అధికారులపై కేసులు నమోదయ్యే వరకు తాను పోలీస్ స్టేషన్‌లోనే ఉంటానని, న్యాయం కోరుతూనే ఉంటానని రాహుల్ స్పష్టం చేశారు. అయితే దీనికి పోలీసులు నిరాకరించడంతో, అతను డీసీపీ సెంట్రల్ సచిన్ శర్మను కలిసి కేసు దర్యాప్తు పురోగతిపై వివరాలు కోరారు.
జులై 20న జరిగిన 'జెన్ జీ' (Gen Z) నిరసనలో పెల్లెట్ గన్ దాడిలో గాయపడిన 19 ఏళ్ల సాహిల్ లోచాబ్‌తో కలిసి ఆయన పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తమ ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయడానికి నిరాకరిస్తున్నారని సాహిల్ ఆరోపించడంతో ఈ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
#WATCH | Delhi: Lok Sabha LoP Rahul Gandhi arrived at the DCP Office at the Parliament Street Police Station to file a complaint. More details awaited. pic.twitter.com/YC7GiXCw7h
— ANI (@ANI) August 21, 2026
రాహుల్ గాంధీ, సాహిల్ . ఇతరులతో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్‌కి రావడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఎఫ్‌ఐఆర్ నమోదుకు పోలీసులు నిరాకరించడంతో, రాహుల్ గాంధీ పోలీస్ స్టేషన్ బయట కూర్చుని ధర్నా నిర్వహించారు.జులై 20న జరిగిన 'సంసద్ చలో' మార్చ్ సమయంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బంది పెల్లెట్ తుపాకులు ఉపయోగించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే, తాము పెల్లెట్ గన్లను ఉపయోగించలేదని దిల్లీ పోలీసులు పలుమార్లు ఖండించగా, సీఆర్‌పీఎఫ్ (CRPF) దీనిపై ఎలాంటి స్పందనా లేదు.


