న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో మహిళా జర్నలిస్టులపై పోలీసుల ప్రవర్తనపై తీవ్ర ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపుతోంది. ముగ్గురు మహిళా జర్నలిస్టులు తమపై పోలీసు సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ ఫిర్యాదులను నిష్పక్షపాత దర్యాప్తు కోసం క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసినట్లు తెలిపారు.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల వ్యవహారం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్నందున అమిత్ షా దీనిపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా జర్నలిస్టు పోలీసు అధికారిపై ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని రాహుల్ ఆరోపించారు. జంతర్ మంతర్‌లో వందలాది మంది జర్నలిస్టులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారని రాహుల్ తెలిపారు. నిరసనల సందర్భంగా మహిళా ఆందోళనకారుల పట్ల కూడా పోలీసుల ప్రవర్తనపై ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. కెమెరాలు లాక్కోవడం, జర్నలిస్టులను ఈడ్చుకెళ్లడం వంటి ఘటనలు జరిగాయని ఆయన ఆరోపించారు.
🚨THIS IS SHAMEFULL Female Journalist alleges an inappropriate behavior by security personnel during Jantar Mantar Protest. @yadavakhilesh @abhijeet_dipke @RahulGandhi #DelhiPolice #JantarMantar #GyaneshKumar https://t.co/jJ1kRjyU98
— Global News 🚨 (@Jarvis945) October 3, 2026
ఇదిలా ఉండగా, సీపీజే, ఏఐఎస్ఏ కూడా మహిళా జర్నలిస్టులు, మహిళా ఆందోళనకారులు, న్యాయవాదుల పట్ల పురుష పోలీసు సిబ్బంది దురుసుగా వ్యవహరించారని ఆరోపించాయి. పలువురు మహిళలు గృహిణులు/జర్నలిస్టులు తమను తాకుతూ వేధించారని ఫిర్యాదు చేసినట్లు ఏఐఎస్ఏ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలపై దర్యాప్తు ఇంకా కొనసాగాల్సి ఉంది. ఢిల్లీ పోలీసులు ఇప్పటికే అందిన ఫిర్యాదులను క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించిన నేపథ్యంలో.. విచారణలో ఏం తేలుతుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
Bravo Delhi Police 🔥🔥 Neha Bora Detained Again On 2nd day of protest At Jantar Mantar https://t.co/GCphH3PNHg
— INDIAN (@hindus47) October 3, 2026
𝐏𝐨𝐥𝐢𝐜𝐞 𝐖𝐢𝐭𝐡𝐨𝐮𝐭 𝐍𝐚𝐦𝐞𝐩𝐥𝐚𝐭𝐞𝐬 Under the cover of Darkness, they are detaining Girls and taking them away in Buses. First of all, Detaining Women in this manner after Dark raises Serious questions about Legality and due Process. Who are these Police Personnel without Nameplates? If anything happens to these Protesting Girls while they are being taken away, Who Will Be Held Accountable? Let's reclaim Jantar Mantar. 🔥 #JantarMantar
— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) October 3, 2026
She refused to leave him 🥹❤️ Woman = God 🙏 https://t.co/lWDe4nfyrB
— 🐅ராச.துரை ஆனந்தன் 🐅 (@thuosi444) October 3, 2026


