PC: X
మెకే వేదికగా బంగ్లాదేశ్‌తో జరగనున్న సిరీస్ డిసైడర్ రెండో టెస్టు కోసం ఆస్ట్రేలియా తమ తుది జట్టును ప్రకటించింది. ఈ కీలక మ్యాచ్‌లో ఆసీస్ జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. పేలవ ఫామ్‌తో సతమవుతున్న జేక్ వెదరాల్డ్‌పై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. తిరిగి మాట్ రెన్‌షాకు పిలుపునిచ్చారు.
2023 మళ్లీ ఆసీస్ టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రెన్‌షా.. ట్రావిస్ హెడ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. అయితే వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్న మిడిలార్డర్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌కు ఆసీస్ మేనెజ్‌మెంట్ మరో అవకాశమిచ్చింది. ఈ మ్యాచ్‌లో కూడా అతడు రాణించకపోతే ఆసీస్ టెస్టు జట్టులో చోటు కోల్పోయే ఛాన్స్ ఇచ్చింది.
అయితే రెండో టెస్టుకు స్పిన్నర్ నాథన్ లియోన్‌ను పక్కన పెట్టి పేసర్ స్కాట్ బోలాండ్‌ను తుది జట్టులోకి తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆసీస్ మేనెజ్‌మెంట్ నాథన్ లియోన్‌వైపే ముగ్గు చూపింది. దీంతో బోలాండ్ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు. కాగా డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో మెకే టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని కంగారులు పట్టుదలతో ఉన్నారు. ఆగస్టు 22 నుంచి ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఆస్ట్రేలియా తుది జట్టు : మ్యాట్ రెన్‌షా, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, గ్రీన్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), బో వెబ్‌స్టర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, జోష్ హేజిల్‌వుడ్.
చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన గిల్ సహచరుడు


