బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి.. అతడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా | Australia Drop This Star After Loss vs Bangladesh Recall Matt Renshaw | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ చేతిలో ఓటమి.. అతడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా

Aug 18 2026 12:53 PM | Updated on Aug 18 2026 1:00 PM

Australia Drop This Star After Loss vs Bangladesh Recall Matt Renshaw

Photo Credit: Cricket Australia

బంగ్లాదేశ్‌ చేతిలో దారుణ ఓటమి తర్వాత క్రికెట్‌ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. తొలి టెస్టులో విఫలమైన ఓపెనర్‌ జేక్‌ వెదర్లాండ్‌పై వేటు వేసింది. అతడి స్థానంలో రెండో టెస్టుకు మ్యాట్‌ రెన్షాను ఎంపిక చేసింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సీజన్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ రెండు మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.

ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య డార్విన్‌ వేదికగా తొలి టెస్టు జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా చారిత్రక విజయం సాధించింది. తిథ్య ఆసీస్‌ను ఊహించని రీతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా 23 ఏళ్ల తర్వాత తొలిసారి కంగారూ గడ్డపై ఆడిన టెస్టు మ్యాచ్‌లో బంగ్లా జయభేరి మోగించింది. 

ఆ ఇద్దరూ విఫలం
ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన వెదర్లాండ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయ్యాడు. రెండుసార్లు బంగ్లా పేసర్‌ హసన్‌ మహమూద్‌ బౌలింగ్‌లోనే వెదర్లాండ్‌ అవుటయ్యాడు.

ఇక ఇప్పటికి మొత్తంగా ఆరు టెస్టులు ఆడిన వెదర్లాండ్‌.. కేవలం 224 పరుగులే చేశాడు. ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ సగటు కేవలం 20. ఈ నేపథ్యంలో వెదర్లాండ్‌ను జట్టు నుంచి తప్పించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా.. రెండో టెస్టుకు మ్యాట్‌ రెన్షాను ఎంపిక చేసింది. 30 ఏళ్ల రెన్షా ఇప్పటికి ఆడిన 14 టెస్టుల్లో కలిపి 645 పరుగులు చేశాడు.

లబుషేన్‌కు మరో అవకాశం
కాగా 2023లో చివరిగా ఆసీస్‌ తరఫున టెస్టు ఆడిన రెన్షా.. వెదర్లాండ్‌ వైఫల్యం కారణంగా మరో అవకాశం దక్కించుకున్నాడు. ట్రవిస్‌ హెడ్‌తో కలిసి ఓపెనర్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌. ఇదిలా ఉంటే.. మార్నస్‌ లబుషేన్‌ సైతం బంగ్లాతో తొలి టెస్టులో విఫలమయ్యాడు. 

ఈ వన్‌డౌన్‌ బ్యాటర్‌ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 1, 31 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో లబుషేన్‌ను కూడా తప్పించాలనే డిమాండ్లు రాగా.. యాజమాన్యం మాత్రం అతడికి మరో అవకాశం ఇచ్చింది. ఇక ఆసీస్‌- బంగ్లా మధ్య ఆగష్టు 22- 26 మధ్య రెండో టెస్టుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందుకు మెకాయ్‌ వేదిక.

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు
ప్యాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), స్కాట్‌ బోలాండ్‌, అలెక్స్‌ క్యారీ, కామెరాన్‌ గ్రీన్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, ట్రవిస్‌ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, మార్నస్‌ లబుషేన్‌, నాథన్‌ లియోన్‌, మ్యాట్‌ రెన్షా, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, బ్యూ వెబ్‌స్టర్‌.

చదవండి: వర్షం ముప్పు.. భారత్‌ గెలవాలంటే అదొక్కటే దారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement