breaking news
Jake Weatherald
-
క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. ఆసీస్ బ్యాటర్‌కు చేదు అనుభవం!
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వన్డే కప్‌లో భాగంగా సౌత్ ఆస్ట్రేలియా, తస్మానియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సౌత్ ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ వెదరాల్డ్ కష్టపడి బౌండరీ కొట్టినప్పటికీ అంపైర్ ఫోర్ ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఓవర్లో ఐదో బంతిని వేసేందుకు తస్మానియా బౌలర్ రాఫ్ మెక్‌మిలన్ సిద్ధమయ్యాడు. అయితే బంతి అనూహ్యంగా అతడి చేతిలో నుంచి స్లిప్ అయి లెగ్‌సైడ్ దిశలో పిచ్ అవతల పడింది. బంతిని అంపైర్ అప్పటికే నోబాల్ కమ్ డెడ్‌బాల్‌గా పరిగణించాడు. అయితే జాక్ వెదరాల్డ్ మాత్రం సరదాగా బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ తరలించాడు. వెదరాల్డ్ కొట్టిన ఫోర్‌ను కౌంట్ చేయని అంపైర్ అతడికి అనుకూలంగా ఫ్రీ హిట్ మాత్రం ఇచ్చాడు. రాఫ్ మెక్‌మిలన్ వేసిన ఫ్రీ హిట్‌ను వెదరాల్డ్ లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ తరలించాడు. మరి అంపైర్ దానిని నోబాల్ కమ్ డెడ్‌బాల్‌గా ఎందుకు పరిగణించారనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎంసీసీ చట్టం ప్రకారం బంతి పిచ్ అవతల బౌన్స్ కావడంతో నోబాల్ ఇవ్వడం జరిగింది. అసలు పిచ్‌పై బంతి పడకపోవడంతో డెడ్‌బాల్‌గా కూడా పరిగణించారు. ఇక ఎంసీసీలోని 21 చట్టం ప్రకారం నోబాల్ వేస్తే ఫ్రీహిట్ ఇవ్వాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. మాథ్యూ గైక్స్ (97 నాటౌట్), జేక్ వెదరాల్డ్ (92), జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (88) భారీ అర్థసెంచరీలతో రాణించడంతో 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 383 పరుగులు చేసింది. తస్మానియా బౌలర్లలో మాథ్యూ కున్మెన్, మిచెల్ ఓవన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన తస్మానియా జట్టు 19 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. టిమ్ వార్డ్ (52), జోర్డాన్ సిల్క్ (48) క్రీజులో ఉన్నారు.Cricket really is a silly game #OneDayCup pic.twitter.com/l3Z7TjBCz9— cricket.com.au (@cricketcomau) September 23, 2026ఇదీ చదవండి: విండీస్‌తో తొలి వన్డే.. జట్టుతో కలవనున్న రో-కో ద్వయం -
ఆసీస్ జట్టు నుంచి అవుట్.. ఆ మరుసటి రోజే ఊహించని ట్విస్ట్?
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టులో ఓ మార్పు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఓపెనర్ జేక్ వెదరాల్డ్‌పై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. సీనియర్ బ్యాటర్ మాట్ రెన్షాకు తిరిగి పిలుపునిచ్చింది. అయితే జట్టు నుంచి ఉద్వాసనకు గురైన వెదరాల్డ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్-2027 సీజన్లో ఆడేందుకు వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ధ్రువీకరిచింది. వచ్చే వేసవిలో జరగనున్న యాషెస్ సిరీస్‌కు ముందు ఈ ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్షిప్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో అద్భుతంగా రాణించి యాషెస్ సిరీస్ కోసం తిరిగి జట్టులోకి రావాలని వెదరాల్డ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కాగా 31 ఏళ్ల వెదరాల్డ్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లు ఆడిన వెదరాల్డ్.. 37.66 సగటుతో 6,290 పరుగులు చేశాడు.ఈ కారణంగానే అతడిని జాతీయ జట్టుకు ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ తనకు లభించిన అవకాశాన్ని జేక్ వినియోగించకోలేకపోయాడు. ఆసీస్ తరపున 6 టెస్టులు ఆడి కేవలం 224 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై వేటు వేసి మాట్ రెన్షాకు జట్టులో అవకాశమిచ్చారు.ట్రావిస్ హెడ్‌తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను రెన్షా ప్రారంభించనున్నాడు. బంగ్లా-ఆసీస్ మధ్య రెండో టెస్టు ఆగస్టు 22 నుంచి మెక్కే వేదికగా ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఆసీస్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బంగ్లా జట్టు.. ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది.చదవండి: భారత వరల్డ్ కప్ జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు! -
బంగ్లాదేశ్ చేతిలో ఓటమి.. అతడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా
బంగ్లాదేశ్ చేతిలో దారుణ ఓటమి తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. తొలి టెస్టులో విఫలమైన ఓపెనర్ జేక్ వెదర్లాండ్పై వేటు వేసింది. అతడి స్థానంలో రెండో టెస్టుకు మ్యాట్ రెన్షాను ఎంపిక చేసింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్లో భాగంగా బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య డార్విన్ వేదికగా తొలి టెస్టు జరిగింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరారా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా చారిత్రక విజయం సాధించింది. తిథ్య ఆసీస్‌ను ఊహించని రీతిలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా 23 ఏళ్ల తర్వాత తొలిసారి కంగారూ గడ్డపై ఆడిన టెస్టు మ్యాచ్‌లో బంగ్లా జయభేరి మోగించింది. ఆ ఇద్దరూ విఫలంఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన వెదర్లాండ్.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. రెండుసార్లు బంగ్లా పేసర్ హసన్ మహమూద్ బౌలింగ్‌లోనే వెదర్లాండ్ అవుటయ్యాడు.ఇక ఇప్పటికి మొత్తంగా ఆరు టెస్టులు ఆడిన వెదర్లాండ్.. కేవలం 224 పరుగులే చేశాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ సగటు కేవలం 20. ఈ నేపథ్యంలో వెదర్లాండ్ను జట్టు నుంచి తప్పించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. రెండో టెస్టుకు మ్యాట్ రెన్షాను ఎంపిక చేసింది. 30 ఏళ్ల రెన్షా ఇప్పటికి ఆడిన 14 టెస్టుల్లో కలిపి 645 పరుగులు చేశాడు.లబుషేన్‌కు మరో అవకాశంకాగా 2023లో చివరిగా ఆసీస్ తరఫున టెస్టు ఆడిన రెన్షా.. వెదర్లాండ్ వైఫల్యం కారణంగా మరో అవకాశం దక్కించుకున్నాడు. ట్రవిస్ హెడ్‌తో కలిసి ఓపెనర్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఇదిలా ఉంటే.. మార్నస్ లబుషేన్ సైతం బంగ్లాతో తొలి టెస్టులో విఫలమయ్యాడు. ఈ వన్‌డౌన్ బ్యాటర్ రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 1, 31 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో లబుషేన్‌ను కూడా తప్పించాలనే డిమాండ్లు రాగా.. యాజమాన్యం మాత్రం అతడికి మరో అవకాశం ఇచ్చింది. ఇక ఆసీస్- బంగ్లా మధ్య ఆగష్టు 22- 26 మధ్య రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు మెకాయ్ వేదిక.బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టుప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మ్యాట్ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.చదవండి: వర్షం ముప్పు.. భారత్ గెలవాలంటే అదొక్కటే దారి


