PC: X
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా జట్టులో ఓ మార్పు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఓపెనర్ జేక్ వెదరాల్డ్‌పై వేటు వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. సీనియర్ బ్యాటర్ మాట్ రెన్‌షాకు తిరిగి పిలుపునిచ్చింది. అయితే జట్టు నుంచి ఉద్వాసనకు గురైన వెదరాల్డ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్-2027 సీజన్‌లో ఆడేందుకు వార్విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని వార్విక్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ ధ్రువీకరిచింది. వచ్చే వేసవిలో జరగనున్న యాషెస్ సిరీస్‌కు ముందు ఈ ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్ సీజన్ ప్రారంభం కానుంది.
ఈ టోర్నీలో అద్భుతంగా రాణించి యాషెస్ సిరీస్ కోసం తిరిగి జట్టులోకి రావాలని వెదరాల్డ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కాగా 31 ఏళ్ల వెదరాల్డ్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లు ఆడిన వెదరాల్డ్.. 37.66 సగటుతో 6,290 పరుగులు చేశాడు.
ఈ కారణంగానే అతడిని జాతీయ జట్టుకు ఆసీస్ సెలక్టర్లు ఎంపిక చేశారు. కానీ తనకు లభించిన అవకాశాన్ని జేక్ వినియోగించకోలేకపోయాడు. ఆసీస్ తరపున 6 టెస్టులు ఆడి కేవలం 224 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై వేటు వేసి మాట్ రెన్‌షాకు జట్టులో అవకాశమిచ్చారు.
ట్రావిస్ హెడ్‌తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను రెన్‌షా ప్రారంభించనున్నాడు. బంగ్లా-ఆసీస్ మధ్య రెండో టెస్టు ఆగస్టు 22 నుంచి మెక్‌కే వేదికగా ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఆసీస్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బంగ్లా జట్టు.. ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది.
చదవండి: భారత వరల్డ్ కప్ జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు!


