టీమిండియా యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. శ్రీలంక టూర్‌లో దుమ్ములేపిన సుతార్.. ఇప్పుడు ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లోనూ ఇరగదీస్తున్నాడు. కార్డిఫ్ వేదికగా గ్లామోర్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్విక్‌షైర్ తరపున మానవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
ఈ రాజస్తాన్ స్పిన్నర్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ కనీసం ఒక్క పరుగు ఇవ్వకుండా మూడు వికెట్లు సాధించాడు. తద్వారా సుతార్ ఓ చారిత్రత్మక రికార్డును పేరిట లిఖించుకున్నాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్ హిస్టరీలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు ఇన్నింగ్స్‌లలోనూ వికెట్ తీసిన రెండవ ఆటగాడిగా సుతార్ నిలిచాడు.
ఇంతకుమందు ఈ ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ టామ్ హేవార్డ్ ఈ ఘనత సాధించారు. 1895 ది ఓవల్ మైదానంలో సర్రే జట్టుపై లీసెస్టర్‌షైర్ తరఫున ఆడుతూ ఆయన ఈ ఫీట్ నమోదు చేశారు. మళ్లీ ఇప్పుడు 131 ఏళ్ల తర్వాత మానవ్ ఈ రికార్డు క్రియేట్ చేశాడు.
ఈ ఒక్క మ్యాచ్‌లోనూ టోర్నీ అంతటా నిలకడగా రాణిస్తున్నాడు. పేస్ బౌలర్లకు అనుకూలంగా కూడా పిచ్‌లపై కూడా అతడు బంతితో మ్యాజిక్ చేస్తున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో అతడు ఇప్పటివరకు 21 వికెట్లు పడగొట్టాడు. సోమర్‌సెట్‌పై ఫైవ్ వికెట్ హాల్ కూడా సాధించాడు.
చదవండి: IND vs AFG: 'వైభవ్ సూర్యవంశీ వద్దు.. అతడే బెటర్'


