PC: X
ఢిల్లీ వేదికగా ఆదివారం నుంచి భారత్-అఫ్గానిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది. గత రెండు నెలలుగా గాయంతో జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నెట్స్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేస్తూ కనిపించాడు.
తన ధనాధన్ పేస్‌తో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని బుమ్రా తిప్పలు పెట్టాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి వైభవ్ నెట్స్‌లో గట్టిగానే శ్రమించాడు. నెట్ ప్రాక్టీస్‌లో బుమ్రా వేసిన ఐదు బంతుల్లో వైభవ్ ఒక్కదాన్ని మాత్రమే సరిగ్గా షాట్ ఆడగలిగాడు. మొదటి గుడ్ లెంగ్త్ బంతికి డిఫెన్స్ ఆడబోయి మిస్ అవ్వగా, రెండో బంతిని వదిలేశాడు. మూడో బంతికి బుమ్రా యార్కర్ విసరగా వైభవ్ అతికష్టం మీద ఎదుర్కొన్నాడు.
నాలుగో బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బంతిని కూడా వదిలేసిన వైభవ్, ఐదో ఓవర్ పిచ్ బంతిని మాత్రం కవర్స్ మీదుగా బౌండరీకి తరలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ప్రాక్టీస్‌లో బుమ్రా ఆధిక్యం ప్రదర్శించినా ఐపీఎల్-2026లో మాత్రం ఈ రాజస్తాన్ చిచ్చరపిడుగు బుమ్రాను ధాటిగానే ఎదుర్కొన్నాడు. కాగా ఈ నెట్ సెషన్ వైభవ్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఫీల్డింగ్ డ్రిల్స్‌లో మూడు క్యాచ్‌లను నేలపాలు చేయడమే కాకుండా ఇతర పేసర్ల బౌలింగ్‌లోనూ ఆడేందుకు వైభవ్ ఇబ్బంది పడ్డాడు.
వైభవ్ తన ఫామ్ కొనసాగిస్తాడా?
కాగా వైభవ్‌కు ఇది మూడో అంతర్జాతీయ టీ20 సిరీస్. ఇంగ్లండ్ టూర్‌లో డెబ్యూ చేసిన వైభవ్.. తన పేలవ ప్రదర్శనలతో నిరాశపరిచాడు. కానీ ఆ తర్వాత జింబాబ్వే పర్యటనలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మూడు ఇన్నింగ్స్‌లలో 50 సగటుతో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.
ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీలోనూ అతడు సత్తాచాటాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను అఫ్గానిస్తాన్‌పై కొనసాగించాలని వైభవ్ ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే సంజూ శాంసన్ రూపంలో వైభవ్ స్ధానానికి ముప్పు పొంచి ఉంది. ఓపెనర్‌గా టీమ్ మేనెజ్‌మెంట్ వైభవ్‌ను కొనసాగిస్తుందా? లేదా మళ్లీ సంజూకు అవకాశమిస్తుందో? ఆదివారం వరకు వేచి చూడాలి.
చదవండి: ‘విరామం ఎక్కువైతే లయ కోల్పోతాను’
Jasprit Bumrah vs Vaibhav Sooryavanshi. What happened next? pic.twitter.com/Ep6igaQUnf
— Tanuj Lakhina (@tanujlakhina) September 11, 2026


