Photo Credit: BCCI Twitter
టీమిండియా రైజింగ్ స్పిన్నర్ మానవ్ సుతార్ కౌంటీ చాంపియన్‌షిప్‌లోనూ అదరగొడుతున్నాడు. వార్విక్‌షైర్ తరఫున ఆడుతున్న మానవ్ సుతార్ తన స్పిన్ మ్యాజిక్‌తో హాంప్‌షైర్‌తో మ్యాచ్‌లో ఏడు వికెట్ల హాల్ (తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు) నమోదు చేయడం విశేషం.
మానవ్ సుతార్ విజృంభణ కారణంగా వార్విక్‌షైర్ ఇన్నింగ్స్ 129 పరుగుల తేడాతో హాంప్‌షైర్‌పై ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్‌షైర్ 398 పరుగులకు ఆలౌటైంది. అనంతరం హాంప్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 115, రెండో ఇన్నింగ్స్‌లో 154 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు వేసిన మానవ్ సుతార్ 42 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 23.3 ఓవర్లు వేసి 52 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
కౌంటీ ఆడడానికి ముందు శ్రీలంక పర్యటనలోనూ మానవ్ సుతార్ దుమ్మురేపాడు. రెండు టెస్టులు కలిపి 11 వికెట్లు పడగొట్టిన సుతార్ ఖాతాలో ఒక ఐదు వికెట్ల హాల్ ఉండడం విశేషం. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత పలుచబడిన స్పిన్ విభాగంలో మానవ్ సుతార్ తన మ్యాజిక్‌తో భారత జట్టులో కొత్త ఆశలు రేపుతున్నాడు.
ఇరగదీసిన చాహల్, అకిబ్ నబీ
ఇక కౌంటీల్లో మానవ్ సుతార్‌తో పాటు మిగతా భారత బౌలర్లు కూడా తమ ప్రదర్శనతో అదరగొట్టారు. జమ్మూ కశ్మీర్ సంచలనం అకిబ్ నబీ కూడా అదిరిపోయే అరంగేట్రం చేశాడు. తొలిసారి కౌంటీల్లో ఆడుతున్న ఈ బారాముల్లా ఎక్స్‌ప్రెస్ సర్రే తరఫున రెండు కీలక వికెట్లు తీసి యార్క్‌షైర్‌పై విజయం సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు.
మరో టీమిండియా సీనియర్ యజ్వేంద్ర చాహల్‌కూడా నార్తంప్టన్‌షైర్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు తీసిన చాహల్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల హాల్ నమోదు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లోనూ చాహల్ అదరగొట్టాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఈ సీజన్‌లో చాహల్ 14 వికెట్లు తీశాడు.
Manav Suthar vs Hampshire:
3/42 in the 1st inns
4/52 in the 2nd inns
Outstanding bowling touch in last few months for Indian spinner... 🔥pic.twitter.com/uTrBKhD1OS— CricketGully (@thecricketgully) September 5, 2026
చదవండి: వైరలవుతున్న అల్కరాజ్ బనియన్ .. ఇదేం కర్మరా దేవుడా!


